Kuwait: కువైత్ గతేడాది ప్రవాసులకు ఎన్ని రెసిడెన్సీ పర్మిట్లు జారీ చేసిందంటే..

ABN , First Publish Date - 2023-03-21T08:25:09+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) జనాభాలో సుమారు 60శాతం వరకు ప్రవాసులే (Expats) ఉన్న విషయం తెలిసిందే.

Kuwait: కువైత్ గతేడాది ప్రవాసులకు ఎన్ని రెసిడెన్సీ పర్మిట్లు జారీ చేసిందంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) జనాభాలో సుమారు 60శాతం వరకు ప్రవాసులే (Expats) ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రతియేటా భారీ సంఖ్యలో రెసిడెన్సీ పర్మిట్లు (Residency Permits) జారీ చేస్తోంది. దీనిలో భాగంగా గతేడాది వలసదారులకు ఆ దేశం 28,38,613 రెసిడెన్సీ పర్మిట్లు ఇచ్చింది. ఈ సంఖ్య అంతకుముందు ఏడాదితో (2021) పోలిస్తే 3.18లక్షలు అధికమని సెంట్రల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (Central Department of Statistics) తాజాగా విడుదల చేసిన ఇమ్మిగ్రేషన్ గణాంకాల ద్వారా తెలిసింది. వీటిలో అధిక భాగం రెసిడెన్సీ పర్మిట్లు డొమెస్టిక్, సివిల్ వర్కర్లకు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. గృహకార్మికులకు 1.62లక్షల పర్మిట్లు జారీ చేస్తే.. 1.65లక్షల రెసిడెన్సీ పర్మిట్లు ప్రైవేట్ సెక్టార్ వర్కర్స్‌కు (Private Sector Workers) జారీ చేయడం జరిగింది.

అలాగే ఈ రిపోర్ట్ ప్రకారం మొదటిసారిగా గతేడాది 67.2శాతం పర్మిట్లు నాన్-అరబ్ ఆసియా దేశాల పౌరులకు జారీ అయ్యాయి. ఇక ప్రైవేట్ రంగంలో (Private Sector) ప్రవాసులకు సంబంధించి కొత్త ఎంట్రీలు కేవలం 22, 258 మాత్రమే నమోదయ్యాయి. ఇదిలాఉంటే.. తాజాగా విడుదల ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం.. 2022లో మొత్తంగా 27,690 మంది వలసదారులు వివిధ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలిసింది. ఇందులో 34 శాతం మంది డొమెస్టిక్ వర్కర్ రెసిడెన్సీ వీసాలను (Domestic Worker Residency Visa) కలిగి ఉండగా.. 32 శాతం మంది విజిట్ లేదా తాత్కాలిక రెసిడెన్సీ వీసాలపై దేశంలో ఉంటున్నట్లు తేలింది. కాగా, గడిచిన మూడేళ్లతో పోలిస్తే మాత్రం 2022లోనే తక్కువ రెసిడెన్సీ ఉల్లంఘనలు (Residency Violations) నమోదైనట్లు తాజా నివేదిక వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం.. ఇకపై వీసాల కోసం వేచి ఉండే అవస్థలకు చెక్!

Updated Date - 2023-03-21T08:25:09+05:30 IST