Saudi Arabia: 9 నెలల్లో 5లక్షల 'ఇ-పాస్‌పోర్ట్స్' జారీ
ABN , First Publish Date - 2023-07-07T07:48:29+05:30 IST
గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు తొమ్మిది నెలల వ్యవధిలో సుమారు 5లక్షల ఇ-పాస్‌పోర్ట్స్ (e-passports) జారీ చేసినట్లు సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రకటించింది.
రియాద్: గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు తొమ్మిది నెలల వ్యవధిలో సుమారు 5లక్షల ఇ-పాస్‌పోర్ట్స్ (e-passports) జారీ చేసినట్లు సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) తాజాగా వెల్లడించింది. ఈ ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టులను అబ్షర్ ఫ్లాట్‌ఫారమ్ ద్వారా జారీ చేయబడ్డాయని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ తెలిపింది. వీటిలో రెన్యువల్ పాస్‌పోర్టులు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇక సౌదీ పౌరులు అబ్షర్ ప్లాట్‌ఫారమ్ (Absher platform) ద్వారా వారి పాస్‌పోర్టులను జారీ చేయవచ్చు లేదా రెన్యువల్ చేసుకోవచ్చు. చివరగా వారు నమోదు చేసుకున్న చిరునామాకు పోస్టల్ క్యారియర్ ద్వారా పాస్‌పోర్టుల (Passports) పంపిణీ జరుగుతుంది. కాగా, పాస్‌పోర్ట్ కనీస చెల్లుబాటు అరబ్ దేశాలకైతే 3నెలలకు తగ్గకుండా ఉండాలి. ఇతర దేశాలకు ఇది 6నెలల వరకు ఉంటుంది. ఇక ఇ-పాస్‌పోర్టు జారీ చేయడానికి పదేళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి జాతీయ ఐడీ తప్పనిసరి అని ఈ సందర్భంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (General Directorate of Passports)- జవాజత్ (Jawazat) స్పష్టం చేసింది.