Anti-Hindu Hate: బ్రిటన్‌లోని పాఠశాలల్లో హిందూ వ్యతిరేక ద్వేషం.. ప్రముఖ సర్వే నివేదికలో షాకింగ్ నిజాలు..!
ABN , First Publish Date - 2023-04-21T09:06:32+05:30 IST
దేశంలోని స్కూళ్లలో హిందూ వ్యతిరేక ద్వేషం (Anti Hindu Hate) శరవేగంగా విస్తరిస్తుందని హెచ్చరిస్తూ బ్రిటన్‌కు (Britain) చెందిన ఓ సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.
లండన్: దేశంలోని స్కూళ్లలో హిందూ వ్యతిరేక ద్వేషం (Anti Hindu Hate) శరవేగంగా విస్తరిస్తుందని హెచ్చరిస్తూ బ్రిటన్‌కు (Britain) చెందిన ఓ సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. బ్రిటన్ పాఠశాలల్లో హిందూ వ్యతిరేక భావజాలానికి భారతీయ విద్యార్థులు (Indian students) బాధితులుగా మారినట్టు 'హెన్రీ జాక్సన్ సొసైటీ' (Henry Jackson Society) అనే సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. ఈ నివేదిక యూకే పాఠశాలల్లో (UK Schools) హిందువులపై పెరుగుతున్న వివక్షను నొక్కి చెబుతోందని ఈ సందర్భంగా సంస్థ పేర్కొంది. షార్లెట్ టిల్‌వుడ్ (Charlotte Littlewood) అనే పీహెచ్‌డీ విద్యార్థిని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. మొత్తం 988 మంది హిందూ విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.
హిందూమతంపై వ్యతిరేకత కారణంగా తమ పిల్లలు స్కూళ్లల్లో వివక్ష ఎదుర్కొన్నట్టు సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తల్లిదండ్రులు తెలియజేశారు. హిందూ మత విద్య విషయంలో కూడా హిందూ విద్యార్థులు (Hindu Students) మతపరంగా వివక్షకు గురవుతున్నారని అధ్యయనంలో పాల్గొన్న కొందరు చెప్పారు. అలాగే ఈ నివేదికలో హిందువులను ఇస్లాంలోకి మార్చమని వేధించడంతో సహా వివిధ సంఘటనలు ప్రస్తావించబడ్డాయి. తమకు ఏ ఇబ్బంది ఎదురు కాలేదని కేవలం ఒక శాతం మంది మాత్రమే పేర్కొనడం గమనార్హం. ఇక 19 శాతం మంది హిందూ తల్లిదండ్రులు పాఠశాలలు హిందూ వ్యతిరేక ద్వేషాన్ని గుర్తించగలవని నమ్ముతున్నారు. 15 శాతం మంది హిందూ పేరెంట్స్ పాఠశాలలు హిందూ-వ్యతిరేక సంఘటనలను తగినంతగా పరిష్కరిస్తాయని భావిస్తున్నట్లు రిపోర్ట్ పేర్కొంది.
Columbus Shooting: అమెరికాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం.. ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువకుడు!
బ్రిటన్‌లో హిందువులపై వివక్ష విస్తృతంగా ఉన్నప్పటికీ కేవలం1 శాతం పాఠశాలల్లోనే ఫిర్యాదులు నమోదైనట్టు సర్వేలో తేలిసింది. అంతేకాకుండా హిందువులపై వివక్షను స్కూళ్లు గుర్తించలేకపోతున్నాయని 81 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. బ్రిటన్ పాఠశాలల్లో 16 సంవత్సరాల వయస్సు వరకు మతపరమైన విద్య (Religious Education) అనేది తప్పనిసరి. అయితే, స్కూళ్లలో హిందూ పిల్లలు బహుళ దేవుళ్లను ఆరాధించడం వల్ల వారిని ఎగతాళి చేస్తున్నారని కొందరు పేరెంట్స్ చెప్పినట్టుగా నివేదిక వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో హిందూ విద్యార్థులు ఇలాంటి వేధింపులను కొన్నేళ్ల పాటు భరించాల్సి వచ్చినట్టు గుర్తించారు.
UK: బ్రిటన్‌లో బీచ్‌కు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థిని.. అనుమానాస్పద మృతి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..!
ఇక ఈ వేధింపులు తట్టుకోలేక తూర్పు లండన్‌కు (East London) చెందిన ఓ విద్యార్థి ఒకే ఏడాదిలో ఏకంగా మూడు పాఠశాలలు మారాల్సి వచ్చినట్టు కూడా ఈ నివేదిక ద్వారా తెలిసింది. వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న 22 ఏళ్లలోపు భారతీయ విద్యా్ర్థులు (Indian Students) కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నట్టు తేలింది. గతేడాది ఆగస్టు చివరలో దుబాయిలో (Dubai) జరిగిన ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో లీసెస్టర్‌లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య చెలరేగిన హింసాకాండను విశ్లేషించిన సమయంలో స్కూళ్లలపై (Schools) తాను దృష్టి సారించినట్టుగా నివేదిక రచయిత షార్లెట్ లిటిల్‌వుడ్ పేర్కొన్నారు.