Indian Woman: సింగపూర్ క్రూయిజ్ నుండి దూకి 64 ఏళ్ల భారతీయ మహిళ మృతి..!
ABN , First Publish Date - 2023-08-03T10:57:17+05:30 IST
సింగపూర్ జలసంధి గుండా వెళుతున్న రాయల్ కరేబియన్ క్రూయిజ్ నుంచి దూకి 64 ఏళ్ల ఓ భారతీయ మహిళ మృతి చెందినట్లు సమాచారం. దాంతో ఆమె కుమారుడు తన తల్లిని కనిపెట్టడంలో సహాయం చేయాల్సిందిగా ప్రధాన మంత్రి కార్యాలయం (PMO), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs)ను కోరాడు.
సింగపూర్: సింగపూర్ జలసంధి గుండా వెళుతున్న రాయల్ కరేబియన్ క్రూయిజ్ నుంచి దూకి 64 ఏళ్ల ఓ భారతీయ మహిళ మృతి చెందినట్లు సమాచారం. దాంతో ఆమె కుమారుడు తన తల్లిని కనిపెట్టడంలో సహాయం చేయాల్సిందిగా ప్రధాన మంత్రి కార్యాలయం (PMO), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs)ను కోరాడు. క్రూయిజ్ కంపెనీ తన తల్లి కనిపించడంలేదని సమాచారం ఇచ్చి చేతులు దులుపుకుందని అతడు వాపోయాడు. కానీ, దాని తాలూకు ఫుటేజీ లేదా వీడియోను క్రూయిజ్ వారు ఇవ్వలేదని, ఆ తర్వాత తాను నిరంతర ప్రయత్నాలతో తన తల్లి చనిపోయినట్లు తెలుసుకున్నాని కుమారుడు అపూర్వ్ సహాని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. క్రూయిజ్ లైనర్ నిఘా ఫుటేజీలో ఆ దృశ్యాలు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తన తల్లి మృతదేహం కోసం అన్వేషణ జరుగుతోందని తెలిపాడు. తనకు సహాయం చేసినందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పీఎంఓ, సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.
భారతీయ హైకమిషన్ (Indian High Commission) అపూర్వ్ సహాని కుటుంబంతో టచ్‌లో ఉంది. ఈ ఘటనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సింగపూర్ అధికారులతో మాట్లాడింది. సహానికి అన్ని రకాల సహకారాన్ని అందించడానికి రాయల్ కరేబియన్ క్రూజ్ ఇండియన్ చీఫ్‌ను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, అంతకుముందు సహానీ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. తన తల్లి ఓడ నుండి దూకిందని క్రూజ్ సిబ్బంది తనకు సమాచారం ఇచ్చారని అన్నాడు. కానీ, సిబ్బంది ఎలాంటి నిఘా ఫుటేజీని చూపించలేదని, తన తల్లిని గుర్తించడానికి ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కూడా చేయలేదని తెలిపాడు. ఆమెతో పాటు వెళ్లిన తన తండ్రిని కూడా దించేశారని చెప్పాడు. రీతా సహానీ, తన భర్త జాకేశ్ సహానీతో కలిసి 'స్పెక్ట్రమ్ ఆఫ్ ది సీస్' (Spectrum of the Seas) క్రూయిజ్ షిప్‌లో ఎక్కింది. ఈ షిప్ సింగపూర్‌కు వెళుతున్నప్పుడు ఆమె ఉన్నట్టుండి ఓడ నుండి నీటిలోకి దూకినట్లు న్యూస్ ఏజెన్సీ కథనాల సారాంశం.