Indian Millionaires: భారత్ నుంచి విదేశాలకు తరలి వెళ్తున్న మిలియనీర్లు.. కారణమిదే..

ABN , First Publish Date - 2023-06-16T10:12:10+05:30 IST

భారత్‌లోని మిలియనీర్లు భారీ సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారు.

Indian Millionaires: భారత్ నుంచి విదేశాలకు తరలి వెళ్తున్న మిలియనీర్లు.. కారణమిదే..

Indian Millionaires: భారత్‌లోని మిలియనీర్లు భారీ సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని హెన్లీ ప్రైవేట్ హెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ (Henley Private Wealth Migration) వెల్లడించింది. 2023లో దాదాపు 6,500 మంది మిలియనీర్లు(Millionaires) భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లనున్నారని ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లో రక్షణ లేదని చాలామంది సంపన్నులు భావించడమే దీనికి ప్రధాన కారణంగా తెలిసింది. అందుకే తమ సంపద చేజారకుండా ఉండేందుకు ఇతర దేశాలకు మకాం మారుస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నమాట. ఇక మిలియనీర్లను కోల్పోతున్న దేశాల్లో చైనా తొలి స్థానం ఉంటే.. ఆ తర్వాతి స్థానంలో ఇండియా నిలిచింది. కాగా, భారత్ నుంచి విదేశాలకు వెళ్తున్న మిలియనీర్లలో ఎక్కువ మంది ఆస్ట్రేలియాకు (Australia) ప్రాధాన్యం ఇస్తున్నారట. ఆ తర్వాత వరుసగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సింగపూర్ (Singapore), అమెరికా (America), స్విట్జర్లాండ్ (Switzerland) ఉన్నాయి.

ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5,200 మంది మిలియనీర్లు ఇండియా నుంచి ఆస్ట్రేలియా తరలి వెళ్లారు. 2022లో యూఏఈకి (UAE) 4,500 మంది వెళ్లగా.. ఈ ఏడాది 3,200 మంది సింగపూర్‌కు వెళ్లేందుకు సిద్దమవుతున్నారట. ఇక అమెరికాకు 2,100 మంది వెళ్లేందుకు రెడీగా ఉన్నారని తెలిసింది. స్విట్జర్లాండ్, కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చగల్, న్యూజిలాండ్ దేశాలకు కూడా కొంతమంది మిలియనీర్లు వెళ్లనున్నారు. ఇక డ్రాగన్ కంట్రీ చైనా విషయానికి వస్తే.. ఆ దేశంలోని మిలియనీర్లు ఎక్కువగా సింగపూర్‌కు వెళుతున్నారు. సింగపూర్‌లో ట్యాక్స్‌లు తక్కువగా ఉండటంతో అక్కడకు వెళ్లేందుకు మిలియనీర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా 13,500 మంది చైనీస్ మిలియనీర్లు ఆ దేశం వీడనున్నారట. 2022లో ఈ సంఖ్య 10, 800గా ఉంది.

Indian lady: భారతీయ మహిళపై దాడి కేసు.. చైనా జాతీయుడిని దోషిగా తేల్చిన సింగపూర్ న్యాయస్థానం


Updated Date - 2023-06-16T10:12:10+05:30 IST