Hit-and-run: యాక్సిడెంట్ చేసి పారిపోయారో.. అంతే సంగతులు.. ఏకంగా రూ. 4.50లక్షల జరిమానా..

ABN , First Publish Date - 2023-10-11T11:13:01+05:30 IST

యాక్సిడెంట్ చేసి, ప్రమాదస్థలి నుంచి పారిపోయేవారిని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (UAE’s Public Prosecution) గట్టిగానే హెచ్చరించింది. ఈ సందర్భంగా నివాసితులకు ఫెడరల్ ట్రాఫిక్ లాపై అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది.

Hit-and-run: యాక్సిడెంట్ చేసి పారిపోయారో.. అంతే సంగతులు.. ఏకంగా రూ. 4.50లక్షల జరిమానా..

దుబాయ్: యాక్సిడెంట్ చేసి, ప్రమాదస్థలి నుంచి పారిపోయేవారిని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (UAE’s Public Prosecution) గట్టిగానే హెచ్చరించింది. ఈ సందర్భంగా నివాసితులకు ఫెడరల్ ట్రాఫిక్ లాపై అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది. 1995లో తీసుకువచ్చిన ఫెడరల్ లా నం.21లోని ఆర్టికల్ 49లో ఉన్న ప్యారాగ్రాఫ్ 5 ప్రకారం 'హిట్ అండ్ రన్' (Hit-and-run) కేసులో జరిమానా, జైలు శిక్షలను వివరించింది. ఇలాంటి సందర్భాల్లో బాధితులు తీవ్రంగా గాయపడితే ప్రమాదానికి కారణమైన వారికి 20వేల దిర్హమ్స్ (సుమారు రూ.4.50లక్షలు) జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియా ఖాతాలలో ఒక పోస్ట్ చేసింది. యాక్సిడెంట్ చేసి, ప్రమాదస్థలి నుంచి ఉడాయించడం క్షమించరాని నేరంగా పేర్కొంది.

ఒకవేళ మీరు కారు ప్రమాదంలో చిక్కుకుంటే ఏం చేయాలి?

999 (యూఏఈలో ఎక్కడి నుంచైనా) నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి. ప్రమాదం గురించి వారికి తెలియజేయాలి. ప్రధానంగా ప్రమాదం జరిగిన లోకేషన్‌ తప్పనిసరి. అలాగే వారి సూచనల కోసం వేచి ఉండాలి. మీకు లేదా ప్రమాదంలో ఎవరికైనా గాయాలైతే అంబులెన్స్ వచ్చే వరకు వేచి ఉండటం ఉత్తమం. ఒకవేళ చిన్న ప్రమాదం జరిగి ఎవరూ గాయపడకపోతే ట్రాఫిక్‌ జామ్‌ను నివారించడానికి మీరు మీ కారును షోల్డర్ లేన్‌కు తరలించవచ్చు. ఆ సమయంలో మీరు మీ కారు నుండి కనీసం 15 మీటర్ల దూరంలో పోలీసుల కోసం వేచి ఉండాలి.

Expats: సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల రిక్రూట్‌మెంట్‌కు.. ప్రవాస ఉద్యోగి కనీస నెలవారీ వేతనం ఎంత ఉండాలంటే?


Updated Date - 2023-10-11T11:14:00+05:30 IST