US: బైడెన్ యంత్రాంగంలో మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు
ABN , First Publish Date - 2023-03-12T10:04:41+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ (Joe Biden) మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు (Indian Americans) కీలక బాధ్యతలు అప్పగించారు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ (Joe Biden) మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు (Indian Americans) కీలక బాధ్యతలు అప్పగించారు. నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ సీఈఓ (Natural Resources Defence Council CEO) మనీష్ బప్నా, ఫ్లెక్స్ చీఫ్ రేవతి అద్వైతిలకు (Revathi Advaithi) వర్తక విధానం, సంప్రదింపుల సలహా కమిటీలో (Advisory Committee for Trade Policy and Negotiations) చోటు కల్పించారు. ఈ కమిటీ యూఎస్ వర్తక విధానాలు, పాలన, అమలు తదితరాలపై సలహాలు సూచనలు చేస్తుంది. ఈ సందర్భంగా అమెరికా అధికార భవనం వైట్‌హౌస్ (White House) ఓ ప్రకటన విడుదల చేసింది. "అద్వైతి పలు సంస్థల్లో కీలక బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. వరుసగా నాలుగేళ్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తివంతమైన మహిళా బిజినెస్ ఉమెన్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే ఆర్థికవేత్త అయిన బప్నాకు పలు కంపెనీల్లో కీలక హోదాల్లో పనిచేసిన అపార అనుభవం ఉంది" అని శ్వేతసౌధం తన ప్రకటనలో పేర్కొంది. కాగా, అధ్యక్షుడు బైడెన్ ఈ సలహా కమిటీలో ఇద్దరు భారతీయులతో పాటు మరో 12 మంది బృందాన్ని ప్రకటించినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.