Bahrain: ప్రవాసులకు బెస్ట్ డెస్టినేషన్‌గా బహ్రెయిన్

ABN , First Publish Date - 2023-07-13T10:18:48+05:30 IST

ప్రవాసులకు ఉత్తమ గమ్యస్థానాల్లో బహ్రెయిన్ ఫస్ట్ ర్యాంక్ దక్కించుకుంది.

Bahrain: ప్రవాసులకు బెస్ట్ డెస్టినేషన్‌గా బహ్రెయిన్

ఎన్నారై డెస్క్: ప్రవాసులకు ఉత్తమ గమ్యస్థానాల్లో బహ్రెయిన్ ఫస్ట్ ర్యాంక్ దక్కించుకుంది. వీసా ప్రాసెస్, స్థానిక అధికారులతో డీలింగ్, బ్యాంక్ ఖాతాల ఓపెనింగ్ ఇలా పలు విషయాల ఆధారంగా ఇంటర్నేషన్స్ (InterNations) నిర్వహించిన ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ 2023 సర్వేలో మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా దేశాల్లో ప్రవాసులకు (Expats) గల్ఫ్ దేశం బహ్రెయిన్ బెస్ట్ డెస్టినేషన్‌గా నిలిచింది. ఇక వరల్డ్‌వైడ్‌ (Worldwide) గా చూసుకుంటే మాత్రం తొమ్మిదో స్థానం దక్కింది. అంతేగాక ప్రవాస బేసిక్స్ ఇండెక్స్‌లో బహ్రెయిన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచంలోనే మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. రోజువారీ కీలక సర్వీసులను సులభతరం చేయడం, పెట్టుబడిదారులకు సహాయక వాతావరణం, సామాజిక జీవితంలో నిరంతర అభివృద్ధిని ఈ నివేదిక హైలైట్ చేసింది.

ఇక ఈ సర్వే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 172 దేశాల్లో 171 దేశాలకు చెందిన 12,065 మంది ఓపినియన్‌ ద్వారా రిపోర్టు రెడీ చేసింది. ఈ సర్వేలో 10 మందిలో తొమ్మిది మంది బ్యాంక్ ఖాతా తెలరవడం సులభమని చెబితే.. 59 శాతం మంది స్థానిక అధికారులతో సులభంగా పనులు చేయించుకోవచ్చని చెప్పారు. కాగా, బహ్రెయిన్ (Bahrain) తర్వాత గల్ఫ్ దేశాల్లో యూఏఈ 11వ స్థానంలో, ఒమాన్ 12వ స్థానంలో సౌదీ అరేబియా 28వ స్థానంలో, ఖతార్ 31వ స్థానంలో, కువైత్ 53వ స్థానంలో నిలిచాయి. ఇక టాప్-3లో వరుసగా మెక్సికో, స్పెయిన్, పనామా ఉన్నాయి. అయితే, ప్రవాసులకు అత్యంత వరెస్ట్ డెస్టినేషన్స్‌గా టాప్-5లో దక్షిణ కోరియా, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఇటలీ, జపాన్ నిలిచాయి.

Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?

Updated Date - 2023-07-13T10:29:09+05:30 IST