Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?

ABN , First Publish Date - 2023-07-11T10:39:59+05:30 IST

విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే.

Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?

ఎన్నారై డెస్క్: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. అంతేందుకు ఒక దేశ అధ్యక్షుడి నుండి ఆ దేశ ప్రధాని వరకు ఇలా ప్రతి ఒక్కరూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించాలంటే దౌత్యపరమైన పాస్‌పోర్ట్ కలిగి ఉండాల్సిందే. అలాంటప్పుడు అసలు ప్రపంచంలో ఎవరికీ కూడా పాస్‌పోర్ట్ లేకుండా విదేశాలకు ప్రయాణించే వెసులుబాటు ఉండదా? అనే డౌటు రాకమానదు. అయితే, ఓ ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. ఈ ముగ్గురు రెండు వందల కంటే ఎక్కువ దేశాలలో ఎలాంటి పాస్‌పోర్ట్ లేకుండానే పర్యటించవచ్చు. వారే యూకే కింగ్, జపాన్ చక్రవర్తి, జపాన్ రాణి. ఈ ముగ్గురికి మాత్రమే పాస్‌పోర్ట్ అవసరం లేదు.

కాగా, ఇటీవల బ్రిటన్‌లో రాజరికం క్వీన్ ఎలిజబెత్-II (Queen Elizabeth II) మరణించడంతో ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్‌ (Charles III) కు బదిలీ అయింది. దీంతో ఆయన పాస్ పోర్ట్ లేకుండానే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకు వెళ్లొచ్చు. అయితే, ఈ సౌకర్యం బ్రిటన్ రాజకుటుంబంలో ఇతరులకు లేదు. వారికి మాత్రం దౌత్యపరమైన పాస్‌పోర్ట్ (Diplomatic Passport) అవసరం అవుతుంది. చార్లెస్ బ్రిటన్ రాజు అయిన వెంటనే, అతని కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు చార్లెస్ బ్రిటన్ రాజు అని, పాస్‌పోర్ట్ (Passport) లేకుండానే పూర్తి గౌరవంతో ఎక్కడికైనా ప్రయాణించడానికి అనుమతించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అన్ని దేశాలకు డాక్యుమెంటరీ సందేశం పంపించడం జరిగింది.

J-and-UK.jpg

ప్రస్తుతం, జపాన్ చక్రవర్తి హిరోనోమియా నరుహిటో (Naruhito), ఆయన భార్య, జపాన్ రాణి మసాకో ఓవాడా (Empress Masako owada). ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమ దేశ చక్రవర్తి, రాణి కోసం ఈ ప్రత్యేక ఏర్పాటును 1971 మే 1వ తారీఖు నుంచి ప్రారంభించిందని జపాన్ దౌత్య రికార్డుల ద్వారా తెలిసింది. దీనిపై ప్రపంచంలోని అన్ని దేశాలకు జపాన్ అధికారిక లేఖను పంపింది. ఇక ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, వారు తమ పాస్‌పోర్ట్‌లను వెంట ఉంచుకోవాలి. వారి పాస్‌పోర్ట్‌లు దౌత్య పాస్‌పోర్ట్‌లు. కానీ, వారికి అతిథ్య దేశం పూర్తి అధికారాలు ఇస్తుంది. వారు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారుల ముందు భౌతికంగా హాజరుకానవసరం లేదు. భద్రతా తనిఖీలు, ఇతర విధానాల నుండి కూడా మినహాయించబడతారు. ఇండియాలో ఈ హోదా దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రికి మాత్రమే అందుబాటులో ఉంది.

UAE Visit Visas: విదేశీయులకు గుడ్‌న్యూస్.. రూ.16వేలు చెల్లిస్తే చాలు.. వీసా గడువు 30 రోజుల వరకు పెంచుకునే వెసులుబాటు


Updated Date - 2023-07-11T10:49:53+05:30 IST