NRI: అంతర్జాతీయ వేదికపై టీసీఎస్ఎస్ ‘బతుకమ్మ’ ఆట

ABN , First Publish Date - 2023-05-28T17:10:09+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలోని త్రిసూర్ పూరమ్ వార్షిక సాంస్కృతిక ఉత్సవాల ప్రేరణతో సింగపూర్‌లో స్థానిక గార్డెన్స్ బై ది బేలోని ది మీడోస్‌లో మే 28న 'సింగపూర్ పూరమ్' పేరుతో వేడుకలు నిర్వహించారు. కన్నులపండువగా జరిగిన వేడుకల్లో సింగపూర్‌లో ఉంటున్న వివిధ భారతీయ రాష్ట్రాలకు చెందిన వారు తమ తమ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళలను ప్రదర్శించారు.

NRI: అంతర్జాతీయ వేదికపై టీసీఎస్ఎస్ ‘బతుకమ్మ’ ఆట

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలోని త్రిసూర్ పూరమ్ వార్షిక సాంస్కృతిక ఉత్సవాల ప్రేరణతో సింగపూర్‌లో (Singapore) స్థానిక గార్డెన్స్ బై ది బేలోని ది మీడోస్‌లో మే 28న 'సింగపూర్ పూరమ్' పేరుతో వేడుకలు నిర్వహించారు. కన్నులపండువగా జరిగిన వేడుకల్లో సింగపూర్‌లో ఉంటున్న వివిధ భారతీయ రాష్ట్రాలకు (Indian states) చెందిన వారు తమ తమ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళలను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ (Telangana) రాష్ట్రానికి చెందిన బతుకమ్మను తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS) (సింగపూర్) కి చెందిన మహిళలు బతుకమ్మ ఆట పాటలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. సింగపూర్‌లో వేడుకలు నిర్వహించడం 2019 నుంచి ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. కొవిడ్ (Covid) నిబంధనల కారణంగా రెండేళ్లుగా నిర్వహించలేదన్నారు. ప్రస్తుతం నిబంధనలు సడలించడంతో ఈ ఏడాది ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచంలో అంతా పూలతో పూజిస్తే.. ఆ పూలనే పూజించే తెలంగాణ ప్రత్యేక సంప్రదాయం ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పారు. ఈ వేడుకల్లో బతుకమ్మ (bathukamma celebrations) ప్రదర్శనకు అవకాశం కల్పించిన సింగపూర్ పూరమ్ 2023 కార్యవర్గ సభ్యులకు.. తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. పూరమ్ నిర్వాహకులు మాట్లాడుతూ సాంస్కృతిక పండుగలో పాల్గొని కొత్త సంప్రదాయాన్ని తోటి ప్రవాస భారతీయులతో పాటు, సింగపూర్ స్థానికులకు పరిచయం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులను అభినందించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన.. సింగపూర్ ఆర్థిక, జాతీయ అభివృద్ధి శాఖలకు ద్వితీయ మంత్రిగా సేవలు అందజేస్తున్న భారతీయ మూలాలు గల ఇంద్రాణి రాజా.. కార్యక్రమ నిర్వాహకులు, కళాకారులను అభినందించారు. బతుకమ్మ వేడుకల్లో సొసైటీ ఉపాధ్యక్షురాలు సునీతా రెడ్డి, మహిళా విభాగం సభ్యులు గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరి పద్మజ, రాధికా రాణి నల్ల, దీప నల్లా, కాసర్ల వందన, నడికట్ల కళ్యాణి, సృజన వెంగళ, బొందుగుల ఉమా రాణి, సౌజన్య మాదారపు, గర్రెపల్లి కస్తూరి, కల్వ కవిత, రోహిణి గజ్జల, స్వప్న కైలాసపు, కీర్తి ముగ్దసాని, నాగుబండి శ్రీలత, మంచికంటి స్వప్న, బవిరిశెట్టి కృష్ణ చైతన్య, మడిచెట్టి సరిత, సుజాత తరిగొండ, శిల్ప రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-28T17:10:09+05:30 IST