Beggar: భిక్షాటన చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయి అధికారులు.. అతడి వద్ద ఉన్న నగదును చూసి నోరెళ్లబెట్టారు..!
ABN , First Publish Date - 2023-03-18T08:53:17+05:30 IST
గల్ఫ్ దేశాల్లో భిక్షాటన చేయడమనేది (Begging) నేరంగా పరిగణిస్తారు.
దుబాయి: గల్ఫ్ దేశాల్లో భిక్షాటన చేయడమనేది (Begging) నేరంగా పరిగణిస్తారు. బిచ్చం ఎత్తుకుంటూ దొరికితే అంతే సంగతులు. కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. అందులోనూ పవిత్ర రంజాన్ మాసంలోనైతే (Holy Month of Ramadan) బెగ్గింగ్‌పై పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తుంటారు. డ్రైవ్‌ల సందర్భంగా ఎవరైనా భిక్షాటన చేస్తూ కనిపిస్తే తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఈ నెలలో రంజాన్ (Ramadan) మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పోలీసులు బిచ్చం ఎత్తుకునే (Begging) వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఈ నేపథ్యంలోనే దుబాయిలో (Dubai) ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. దుబాయ్ యాంటీ ఇన్‌ఫిల్ట్రేటర్స్ డిపార్ట్‌మెంట్ (Dubai Anti-Infiltrators Department) అధికారులు ఓ బిచ్చగాడిని అదుపులోకి తీసుకున్నారు. కృత్రిమ అవయవాలు అమర్చుకున్న అతడు.. రోడ్డు పక్కన భిక్షాటన చేస్తూ కనిపించాడు. దాంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత బిచ్చగాడి (Beggar) వద్ద ఉన్న నగదు చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. అతడి వద్ద ఏకంగా 3లక్షల దిర్హమ్స్ ఉన్నాయి. మన కరెన్సీలో అక్షరాల రూ. 67.41లక్షలు. కేవలం బెగ్గింగ్ ద్వారానే అతడు అంత పెద్ద మొత్తం పొగు చేసినట్లు అధికారి కల్నల్ అలీ అల్ షంసీ (Colonel Ali Al Shamsi) వెల్లడించారు. ఈ సందర్భంగా దొంగచాటున బెగ్గింగ్ చేసే వారిని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఇలాంటి పనులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని అల్ షంసీ వార్నింగ్ ఇచ్చారు. ఈ పవిత్ర మాసంలో ఇలాంటి కేసులు పెరుగుతాయని చెప్పిన ఆయన.. తమ డిపార్ట్‌మెంట్ ఈ కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టబోయేది లేదని వార్న్ చేశారు.
ఇది కూడా చదవండి: వామ్మో.. నిత్యానంద లీలలు మాములుగా లేవుగా.. ఏకంగా అమెరికాలోని 30 నగరాలకే ఎసరు..!