Domestic worker: గృహ కార్మికుల రెసిడెన్సీ రద్దుపై కువైత్ సంచలన ప్రకటన
ABN , First Publish Date - 2023-10-31T10:05:18+05:30 IST
గృహ కార్మికుల రెసిడెన్సీ రద్దుపై కువైత్ సంచలన ప్రకటన చేసింది.
కువైత్ సిటీ: గృహ కార్మికుల రెసిడెన్సీ రద్దుపై కువైత్ సంచలన ప్రకటన చేసింది. విదేశీ కార్మికుడు దేశం విడిచిపెట్టిన మూడు నెలల తర్వాత వారి గృహ కార్మికుల (Domestic workers) రెసిడెన్సీని రద్దు చేసే హక్కు ఆర్టికల్ 20 ప్రకారం పౌరుడికి ఉందని అంతర్గత మంత్రిత్వ శాఖ (Ministry of Interior) లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం స్పష్టం చేసింది. అలా చేయకపోతే ఆరు నెలల తర్వాత వారి రెసిడెన్సీ ఆటోమెటిక్‌గా రద్దు చేయబడుతుందని పేర్కొంది. దేశాన్ని విడిచిపెట్టిన 3నెలల తర్వాత పౌరులు 'సహెల్ యాప్' (Sahel App) ద్వారా రద్దు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. ఈ కొత్త రూల్ (New Rule) నవంబర్ 5వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.