Share News

H-1B visa stamping: ఇంకా కార్యరూపం దాల్చని ‘వీసా స్టాంపింగ్‌’ ప్రాజెక్ట్.. నిరాశలో వేలాదిమంది భారతీయులు

ABN , First Publish Date - 2023-10-15T06:41:13+05:30 IST

హెచ్‌, ఎల్‌ కేటగిరీ ఉద్యోగుల వీసాల రెన్యువల్‌ కోసం దేశీయంగానే(అమెరికాలోనే) స్టాంపింగ్‌ ప్రక్రియను అనుమతించే పైలట్‌ కార్యక్రమం ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాదిమంది భారతీయ నిపుణులు నిరాశ చెందుతున్నారు.

H-1B visa stamping: ఇంకా కార్యరూపం దాల్చని ‘వీసా స్టాంపింగ్‌’ ప్రాజెక్ట్.. నిరాశలో వేలాదిమంది భారతీయులు

వాషింగ్టన్‌, అక్టోబరు 14: హెచ్‌, ఎల్‌ కేటగిరీ ఉద్యోగుల వీసాల రెన్యువల్‌ కోసం దేశీయంగానే(అమెరికాలోనే) స్టాంపింగ్‌ ప్రక్రియను అనుమతించే పైలట్‌ కార్యక్రమం ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాదిమంది భారతీయ నిపుణులు నిరాశ చెందుతున్నారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల్లో వేలాదిమంది సెలవుల్లో కుటుంబంతో గడిపి రావాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు. స్వదేశంలో కుటుంబసభ్యులతో గడిపిన తర్వాత తిరిగి అమెరికా రావాలంటే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, లేదా చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబైలలోని అమెరికా కాన్సులేట్‌లలో పాస్‌పోర్టులపై స్టాంపింగ్‌ వేయించుకోవాల్సి ఉంటుంది. 2004లో దీనిని నిలిపివేశారు. దీంతో స్వదేశంలో పత్రాలపై స్టాంపింగ్‌ కోసం సుదీర్ఘకాలం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, వీసా రెన్యువల్‌కు దేశీయంగానే స్టాంపింగ్‌ను అనుమతించే పైలట్‌ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు గతనెలలోనూ భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ప్రకటించారు. కానీ, అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడం భారతీయులను నిరాశకు గురిచేస్తోంది. దీంతో సెలవుల్లో కుటుంబంతో గడిపే ప్రణాళికలను చాలామంది వాయిదా వేసుకొంటున్నారు.

US: గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే వార్త.. భారతీయులకు భారీ ప్రయోజనం

Updated Date - 2023-10-15T06:42:33+05:30 IST