Bay Area: అమెరికాలో మ్యూజికల్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్.. దేవీ శ్రీ ప్రసాద్ రచ్చ రంబోలా..!
ABN , First Publish Date - 2023-07-27T12:43:11+05:30 IST
అమెరికాలోని బే ఏరియాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PEOPLES MEDIA FACTORY)ల ఆధ్వర్యంలో మ్యూజిక్ ఫెస్టివల్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఘనంగా జరిగింది.
బే ఏరియాలో డీఎస్పీ రచ్చ రంబోలా
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PEOPLES MEDIA FACTORY)ల ఆధ్వర్యంలో మ్యూజికల్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్
Bay Area: అమెరికాలోని బే ఏరియాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PEOPLES MEDIA FACTORY)ల ఆధ్వర్యంలో మ్యూజిక్ ఫెస్టివల్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఘనంగా జరిగింది. బే ఏరియాలోని సంగీత ప్రియులను టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన ఆటపాటలతో కట్టిపడేశారు. హేమచంద్ర, పృథ్వీ, సాగర్, మంగ్లీ, రీటా, మౌనిక, ఇంద్రావతి చౌహాన్‌ల బృందం బే ఏరియాలోని సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నటి అనసూయ యాంకర్‌గా వ్యవహరించారు. ఈ మ్యూజికల్ ఫెస్టివల్‌కు దాదాపు 3,500 మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. 4 గంటల పాటు నాన్‌స్టాప్‌గా తెలుగు పాటలతో బే ఏరియా మార్మోగిపోయింది. ఇటీవలి కాలంలో ఈ తరహా మ్యూజిక్ ఈవెంట్ జరగలేదని, ఈ ఈవెంట్ అత్యుత్తమమైనదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. పక్కా ప్రణాళికతో పాటు నిర్వాహుకుల కృషి వల్లే ఈ ఈవెంట్ మెగా హిట్ అయిందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మెలోడీ హిట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఎస్పీ…ఆ తర్వాత మాస్ పాటలతో మత్తెక్కించాడు. ప్రేక్షకులు దేవీ శ్రీ ప్రసాద్ బృందం పాటలను ఆస్వాదిస్తూ ఆనందంతో డ్యాన్స్ చేశారు. కొరియోగ్రాఫర్లు దీప, శాండీల ఆధ్వర్యంలో నడుస్తున్న రిషి డ్యాన్స్ అకాడమీ బృందం చేసిన డ్యాన్స్ ఈ ఈవెంట్‌కు మరో హైలైట్ అని చెప్పాలి. వారి స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 4 గంటలపాటు నిర్విరామంగా రసవత్తరంగా సాగింది. 'బాటా' సలహాదారు విజయ ఆసూరి అతిథులందరినీ సాదరంగా ఆహ్వానించారు. ఈ ఈవెంట్ హాజరై దీనిని విజయవంతం చేసి ప్రేక్షకులకు, ఈ ఈవెంట్లో పాల్గొన్నవారికి బాటా ప్రెసిడెంట్ కొండల్ కొమరగిరి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాధించడానికి కారణమైన బాటా బృందాన్ని, వాలంటీర్లను ఆయన అభినందించారు.
శివ కాడా (వైస్ ప్రెసిడెంట్), వరుణ్ ముక్కా(సెక్రటరీ), హరి సన్నిధి (జాయింట్ సెక్రటరీ)లతో కూడిన ‘‘బాటా కమిటీ’’.. రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరిలతో కూడిన “స్టీరింగ్ కమిటీ”.. శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన “సాంస్కృతిక కమిటీ”.. సురేష్ శివపురం, రవి పోచిరాజులతో కూడిన “లాజిస్టిక్స్ టీమ్”.. సందీప్ కె.సంకేత్, ఉదయ్, ఆదిత్య, సందీప్, గౌతమి, హరీష్ లతో కూడిన ‘‘యూత్ కమిటీ’’ని కొండల్ కొమరగిరి ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసిన బాటా బృందాన్ని, వాలంటీర్లను జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటిలతో కూడిన BATA “అడ్వయిజరీ బోర్డు” అభినందించింది.
ఇంత అద్భుతమైన, వినోదభరితమైన కార్యక్రమాన్ని రూపొందించిన బాటా బృందంపై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ టీ.వీ. నాగేంద్ర ప్రసాద్ (CG SFO ఇండియా కాన్సులేట్) ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు విశేష కృషి చేసిన బాటా సభ్యులను టీ.జీ. విశ్వ ప్రసాద్ (పీపుల్ మీడియా) అభినందించారు. ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చిన స్పాన్సర్లకు వేదికపై నుంచి పేరుపేరునా BATA కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఇక ఈ ఈవెంట్‌కు గ్రాండ్ స్పాన్సర్ రియల్టర్: నాగరాజ్ అన్నయ్య పవర్డ్ బై యు స్మైల్ డెంటల్, గోల్డ్ స్పాన్సర్లు: Mealo యాప్ & స్ట్రైవ్ ఏవియేషన్, ఫుడ్ స్పాన్సర్: కేక్స్ బేక్స్ వ్యవహారించారు.