Indian Woman: సింగపూర్‌లో ఘోరం.. భారతీయ వృద్ధురాలిని హతమార్చిన పని మనిషి..!

ABN , First Publish Date - 2023-05-20T08:12:56+05:30 IST

సింగపూర్‌లో (Singapore) ఘోరం జరిగింది. పని మనిషి (Domestic Worker) భారతీయ వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చింది.

Indian Woman: సింగపూర్‌లో ఘోరం.. భారతీయ వృద్ధురాలిని హతమార్చిన పని మనిషి..!

సింగపూర్ సిటీ: సింగపూర్‌లో (Singapore) ఘోరం జరిగింది. పని మనిషి (Domestic Worker) భారతీయ వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఈ కేసుకు సంబంధించి నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సింగపూర్‌లో స్థిరపడిన ఓ భారత సంతతి మహిళ ఇంట్లో పని చేయడానికి 2018 ప్రారంభంలో మయన్మార్‌కు (Myanmar) చెందిన 22 ఏళ్ల జిన్ మార్ న్వీ (Zin Mar Nwe) వచ్చింది. అయితే, ఆ ఇంటి ఓనర్‌ అత్తగారయిన వృద్ధురాలు తరచూ ఆమెను వేధించడం చేసింది. సరిగా పనిచేయకపోతే తిరిగి మయన్మార్‌కు పంపుతానని బెదిరించేది. రోజురోజుకి ఆమె వేధింపులు ఎక్కువ కావడంతో జిన్ మార్ ఆ వృద్ధురాలిపై కోపం పెంచుకుంది.

ఈ క్రమంలో జూన్ 25వ తేదీన వృద్ధురాలిని కూరగాయలు కట్ చేసే కత్తితో (Knife) జిన్ మార్ విచక్షణారహితంగా పొడిచింది. వృద్ధురాలు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోంచి కొంత నగదు తీసుకుని దేశం దాటేందుకు దగ్గరలోని పాస్‌పోర్ట్ కేంద్రానికి వెళ్లింది. అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో కొద్దిగంటల్లోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక వృద్ధురాలి శరీరంపై దాదాపు 26 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, పోలీసుల విచారణలో మొదట తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని జిన్ మార్ బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసులు ఆమె చేసిన హత్య తాలూకు ఆధారాలు చూపించడంతో తన నేరాన్ని అంగీకరించింది. వృద్ధురాలు (Old Woman) తననుమానసికంగా, శారీరకంగా వేధించడంతో భరించలేక ఆమెను హత్య చేసినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది.

Swastika symbol: 'స్వస్తిక్‌' గుర్తు తెచ్చిన తంటా.. సౌదీలో కటకటాల వెనక్కి తెలుగోడు..!

తనను అసభ్యపదజాలంతో పలుమార్లు దూషించిందని చెప్పిన ఆమె.. తన తల, వీపుపై ఆమె పలుమార్లు కొట్టిందని చెప్పింది. ఈ క్రమంలో ఒకరోజు మసాజ్ చేస్తుండగా అది ఆమెకు నచ్చకపోవడంతో తనను చెంపపై కొట్టడంతో భరించలేకపోయానని చెప్పుకొచ్చింది. అయితే, నేరం జరిగిన రోజున నిందితురాలి మానసిక పరిస్ధితి బాలేదని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. కానీ, వారి వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. బాధితురాలిని కత్తితో పొడిచినప్పుడు నిందితురాలు స్పృహలోనే ఉందని, కత్తిపోట్లకు సంబంధించిన వివరాలు ఆమెకు గుర్తున్నాయని.. అదే విషయాన్ని పోలీసులకు చెప్పిందని న్యాయమూర్తి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తుది తీర్పును మాత్రం వాయిదా వేసింది. కాగా, ఈ హత్య నేరానికి జిన్‌ మార్‌కు ఉరిశిక్షగానీ, జీవితఖైదు గానీ పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Indian origin: న్యూయార్క్ పోలీస్ విభాగంలో చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళా అధికారి.. నిజంగా చాలా గ్రేట్!


Updated Date - 2023-05-20T08:12:56+05:30 IST