World Record: దుబాయిలో చరిత్ర సృష్టించిన భారత ప్రవాసుడు..!
ABN , First Publish Date - 2023-03-24T11:02:44+05:30 IST
దుబాయిలో ఉండే భారత ప్రవాసుడు (Indian Expat) సుజిత్ వర్గీస్ (Sujith Varghese) సరికొత్త ప్రపంచ రికార్డు (World Record) నమోదు చేశారు.
అబుదాబి: దుబాయిలో ఉండే భారత ప్రవాసుడు (Indian Expat) సుజిత్ వర్గీస్ (Sujith Varghese) సరికొత్త ప్రపంచ రికార్డు (World Record) నమోదు చేశారు. ఆయన తన వీల్‌చైర్‌పై (Wheelchair) ప్రపంచలోనే అతిపెద్ద జీపీఎస్ (GPS) డ్రాయింగ్‌ను గీసేందుకు బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) చుట్టూ ఉన్న మార్గాన్ని గుర్తించి చరిత్ర సృష్టించారు. ఈ ఫీట్ సాధించడంపై వర్గీస్ స్పందిస్తూ ఇతర వీల్‌చైర్‌లో ఉన్న అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలవడమే తన ధ్యేయమని అన్నారు. వైకల్యాల వల్ల వారు వెనుకడగు వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ.. "అందరికి వెలుగునిచ్చే వ్యక్తిగా ఉండండి. మీరు ఎదుర్కొనే సవాళ్లను.. ఎదుర్కొనే అదృష్టం లేని వారి కోసం కొత్త భూభాగాలను చార్ట్ చేయండి. ఎందుకంటే జీవితంలో పెద్ద కష్టాలను అధిగమించే అవకాశం ఉన్న వ్యక్తి మాత్రమే గొప్పతనానికి అర్హుడు. మీకు ఆ సువర్ణావకాశం ఉంది. కాబట్టి మీరు అన్ని విధాలుగా సాధించి, మీ పేరును అన్ని తరాలు చూసేలా చరిత్ర పుస్తకాలలో లిఖించుకోండి" అని వర్గీస్ చెప్పుకొచ్చారు. ఇక అల్ ముస్తక్బాల్ స్ట్రీట్ నుంచి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ గుండా బుర్జ్ ఖలీఫా చుట్టూ తిరుగుతూ ఆయన ఈ ఘనతను సాధించారు. వర్గీస్ ఈ ఫీట్ ద్వారా 8.71 కిలోమీటర్లతో తీసిన డ్రాయింగ్‌తో 'లార్జెస్ట్ జీపీఎస్ డ్రాయింగ్(వ్యక్తిగత)'గా గిన్నీస్ వరల్డ్ రికార్డును (Guinness World Record) సొంతం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఆ రెండు వీసాలపై యూఎస్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై వాటితో కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు..!