Kuwait: వామ్మో.. 200శాతం పెరిగిన విమాన టికెట్ల ధరలు.. ప్రయాణీకుల గగ్గొలు!
ABN , First Publish Date - 2023-02-23T10:40:15+05:30 IST
ఈ నెల 25 కువైత్ జాతీయ దినోత్సవం (National Day) సందర్భంగా వరుసగా సెలవులు (Holidays) రావడంతో నివాసితులు, ప్రవాసులు (Expats) విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు.
కువైత్ సిటీ: ఈ నెల 25 కువైత్ జాతీయ దినోత్సవం (National Day) సందర్భంగా వరుసగా సెలవులు (Holidays) రావడంతో నివాసితులు, ప్రవాసులు (Expats) విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు, టర్కీ, లండన్, కైరో, బీరూట్ తదితర గమ్యస్థానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో విమాన టికెట్ల ధరలకు (Flight Ticket Prices) ఒక్కసారిగా రెక్కలు వచ్చేశాయి. ఏకంగా 200 శాతం మేర విమాన టికెట్ల ధరలు పెరిగినట్లు కువైత్ ట్రావెల్ ఏజెన్సీలు (Kuwait Travenl Agencies) చెబుతున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులతో (International Flight Services) పాటు దేశీయ విమానాలకు కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉందని కువైత్ ఎయిర్‌వేస్ (Kuwait Airways) అధికారి షోరఖ్ అల్-అవధి వెల్లడించారు. ప్రయాణీకుల డిమాండ్ మేరకు కొత్త గమ్యస్థానాలకు కొత్త సర్వీసులు సైతం ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
అల్-మక్తబ్ ట్రావెలింగ్ ఏజెన్సీ డైరెక్టర్ నసీబ్ అద్నాన్ మాట్లాడుతూ.. నేషనల్ హాలీడేస్ కారణంగా సాధారణ రోజుల కంటే ప్రజల ప్రయాణాలు ఏకంగా 90శాతం పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలోనే విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయని తెలిపారు. ప్రధానంగా లండన్, కైరో, రియాధ్, జెడ్డా, దుబాయ్ (Dubai) నగరాలకు భారీ సంఖ్యలో టికెట్ల బుకింగ్స్ (Ticket Bookings) జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. అటు పర్యాటకుల సందర్శనలు భారీగా పెరడగడంతో టూరిజం ఏజెన్సీలకు (Tourism Agencies) కూడా ఆదాయం పెరిగింది. 2021లో 157.83 మిలియన్ కువైటీ దినార్లుగా ఉన్న ఆదాయం 2022లో 276.71 మిలియన్ కేడీలకు చేరింది. ఇక కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న 2020లో ఇది కేవలం 63.22 కువైటీ దినార్లు మాత్రమే. మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు పర్యాటకంతో పాటు అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక విమానయాన రంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండేళ్లు నేలచూపులు చూసిన విమానయానం ఇప్పుడు మునుపటి కళను సంతరించుకుంటుంది.
ఇది కూడా చదవండి: భారత్‌కే తొలి ప్రాధాన్యం.. ఈ ఏడాది అధిక వీసాలు భారతీయులకే..!