Forgotten patients: కువైత్‌కు కొత్త తలనొప్పి.. అలాంటి వారి వల్ల ఏడాదికి రూ.48కోట్ల అదనపు భారమని గగ్గొలు!

ABN , First Publish Date - 2023-08-20T12:09:49+05:30 IST

కువైత్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఏవరైతే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమవారిని ఆస్పత్రుల్లోనే విడిచివెళ్లిపోతున్నారో.. అలాంటి వారిపై చేసే వ్యయం రోజుకురోజుకు పెరిగిపోతుండడంతో అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Forgotten patients: కువైత్‌కు కొత్త తలనొప్పి.. అలాంటి వారి వల్ల ఏడాదికి రూ.48కోట్ల అదనపు భారమని గగ్గొలు!

కువైత్ సిటీ: కువైత్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఏవరైతే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమవారిని ఆస్పత్రుల్లోనే విడిచివెళ్లిపోతున్నారో.. అలాంటి వారిపై చేసే వ్యయం రోజుకురోజుకు పెరిగిపోతుండడంతో అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇలాంటి వారిపై ఏడాదికి దాదాపు 1.8మిలియన్ కువైటీ దినార్లు (రూ.48.77కోట్లు) వెచ్చిస్తోంది. అటు వీరి కోసం ఆస్పత్రి సిబ్బందిని కేటాయించడం కూడా సమస్యగా పరిణమిస్తోందని వైద్య అధికారులు వాపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి వారు ఏళ్ల తరబడి ఆస్పత్రి బెడ్స్‌పైనే ఉంటున్నారు. వారికి అయ్యే ఆస్పత్రి ఖర్చులు, సిబ్బందిని కేటాయించడం అంతా ప్రభుత్వమే చూస్తోంది. ఇది ప్రస్తుతం గవర్నమెంట్‌కు తలకు మించిన భారంగా మారుతోంది. అక్కడి పబ్లిక్ ఆస్పత్రులలోని వైద్యులు, నర్సుల సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇలాంటి రోగుల సంఖ్య ప్రస్తుతం 270కి చేరినట్లు తెలిసింది.

ఇక వివిధ ఆస్పత్రుల డేటా ప్రకారం.. ఫర్వానియా ఆస్పత్రిలో 10 మంది, ముబారక్ అల్ కబీర్ హాస్పిటల్‌లో 35 మంది, అమిరి ఆస్పత్రిలో 38 మంది, అదాన్ హాస్పిటల్‌లో 46 మంది ఇలాంటి రోగులు ఉన్నారు. అలాగే జహ్రా పబ్లిక్ హాస్పిటల్‌లో అత్యధికంగా 122 మంది ఉన్నారు. వీరిలో 99 మంది వృద్ధులు (42 మంది కువైటీలు, 57 మంది నాన్-కువైటీలు) ఉండగా.. 23 మంది పిల్లలు (కువైటీలు 11 మంది, నాన్-కువైటీలు 12 మంది) ఉన్నారు. మరో 19 మంది ఇతర ఆస్పత్రుల్లో ఉన్నారని డేటా ద్వారా తెలిసింది. కాగా, రోజురోజుకీ వీరి సంఖ్య పెరిగిపోతున్నట్లు డేటా చెబుతోంది. దాంతో ఏళ్ల తరబడి ఇలాంటి రోగులకు అయ్యే ఖర్చులు కూడా భారీగానే పెరుగుతోంది.

NRI: విషాదం.. యూఎస్‌లో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి.. ఇంట్లోనే విగతజీవులుగా దంపతులు, ఆరేళ్ళ కొడుకు!


Updated Date - 2023-08-20T12:09:49+05:30 IST