Lifetime Achievement: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యూకేలో అరుదైన గౌరవం!
ABN , First Publish Date - 2023-02-01T09:54:31+05:30 IST
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh)కు బ్రిటన్‌లో జీవితకాల సాఫల్య గౌరవ పురస్కారాన్ని (Lifetime Achievement Honour) ప్రకటించడం జరిగింది.
లండన్: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh)కు బ్రిటన్‌లో జీవితకాల సాఫల్య గౌరవ పురస్కారాన్ని (Lifetime Achievement Honour) ప్రకటించడం జరిగింది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా భారత్-బ్రిటన్ విజేతల సంఘం ఈ అవార్డును ప్రకటించింది. లండన్‌లోని ఇండియా యూకే ఎచీవర్స్ హానర్స్ మన్మోహన్ సింగ్‌ను లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ గౌరవ పురస్కారానికి ఎంపిక చేశారు. గతవారం అవార్డుల వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. బ్రిటన్‌లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం(NISAU) త్వరలోనే ఢిల్లీలో మన్మోహన్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనుంది.
ఇక బ్రిటీష్ విశ్వవిద్యాలయాలలో జీవితంలో ఘన విజయాలు సాధించిన భారతీయులకు లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ పురస్కారం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఎన్‌ఐఎస్‌ఎయు బ్రిటిష్ కౌన్సిల్ ఇన్ ఇండియా, డిపార్టుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (DIT) భాగస్వామ్యంతో ఇండియా యూకే ఎచీవర్స్ హానర్స్ ఇవ్వడం జరుగుతోంది. ఇక తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల మన్మోహన్ స్పందిస్తూ.. బ్రిటీష్ యూనివర్శిటీల్లో చదువుకుని భారతదేశ భవితకు సారథులైన యువత నుంచి ఈ గౌరవం పొందడం తనను ఎంతో కదిలిస్తోందని తన లిఖిత సందేశంలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: భారతీయులారా ఆందోళన వద్దు.. ఉద్యోగాలు పోతున్నా.. ఇంకా అవకాశాలున్నాయి