Ganga Pushkaram 2023: ఘనంగా ముగిసిన గంగా పుష్కరాలు.. పోటెత్తిన తెలుగు భక్తులు.. తెలుగు సంఘాలదే కీలక పాత్ర

ABN , First Publish Date - 2023-05-04T07:46:22+05:30 IST

వారణాసిలో గత 12 రోజుల నుండి జరిగిన గంగా పుష్కరాలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి.

Ganga Pushkaram 2023: ఘనంగా ముగిసిన గంగా పుష్కరాలు.. పోటెత్తిన తెలుగు భక్తులు.. తెలుగు సంఘాలదే కీలక పాత్ర

వారణాసి నుండి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ: వారణాసిలో గత 12 రోజుల నుండి జరిగిన గంగా పుష్కరాలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా కాశీలో ఉన్న అన్ని తెలుగు సంఘాలు, ఆశ్రమాలు, మఠాల ఆధ్వర్యంలో స్థానిక కేదార్ ఘాట్‌లో ముగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగు యాత్రికులు, వివిధ మఠాధిపతులు, స్వామీజీలు, తెలుగు సంఘాల నిర్వాహకులు హాజరయ్యారు. గంగా నదికి హారతి ఇస్తూ పుష్కరాలకు ముగింపు పలికారు.

GG.jpg

*  రాజ్యసభ సభ్యుడు కాశీ తెలుగు సమితి గౌరవ అధ్యక్షుడు జీవీఎల్ నరసింహారావు ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాశీ తెలుగు సమితి అధ్యక్షుడు, వి సుందర శాస్త్రి చింతామణి, గణపతి ట్రస్ట్ నిర్వాహకుడు చల్లా వెంకట సుబ్బారావు తదితరుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

GGGGGGG.jpg

*  100 తెలుగు సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం. ఈసారి జరిగిన గంగా పుష్కరాలలో తెలుగు వారిదే అగ్రస్థానం. దాదాపు 100 తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ప్రతినిత్యం రెండు పూటలా అన్నదానం చేశారు. వారణాసిలో గంగా తీరం వెంబడి ఎక్కడ చూసినా తెలుగు యాత్రికుల సందడే కనిపించింది.

GGG.jpg

*  అమెరికా నుండి తానా సభ్యులు పంపిన విరాళాలతో స్థానిక శివాలఘాట్లో నిర్వహించిన అన్నదానానికి మంచి స్పందన లభించింది. అన్నదానంతో పాటు అల్పాహారం, చల్లటి మంచినీటి సీసాలు, మజ్జిగ ప్యాకెట్లు అందించారు. తానా తరపున 30 వేల మంచినీటి సీసాలను విశ్వనాథ మందిరానికి విరాళంగా అందించారు. పుష్కరాల సందర్భంగా 29వ తేదీన ప్రధాని మోదీ తెలుగు సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించారు. కాశీలో తెలుగువారు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.

GGGGGG.jpg

GGGG.jpg

GGGGG.jpg

G.jpg

Updated Date - 2023-05-04T07:48:45+05:30 IST