H-1B Visa: అమెరికా సరికొత్త ఆలోచన.. వేలాది మంది భారతీయులకు పెద్ద ఊరట!

ABN , First Publish Date - 2023-02-11T07:38:46+05:30 IST

హెచ్‌-1 బీ, ఎల్‌1 వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ టెకీలకు ప్రయోజనం కలిగేలా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకోనుంది.

H-1B Visa: అమెరికా సరికొత్త ఆలోచన.. వేలాది మంది భారతీయులకు పెద్ద ఊరట!

అమెరికాలోనే హెచ్‌1-బీ పునరుద్ధరణ!

ఈ ఏడాది చివర్లో పైలట్‌ ప్రాజెక్టు.. భారతీయులకు లబ్ధి

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 10: హెచ్‌-1 బీ, ఎల్‌1 వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ టెకీలకు ప్రయోజనం కలిగేలా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకోనుంది. ‘స్థానికంగా వీసాల పునరుద్ధరణ’ను మళ్లీ ప్రారంభించాలని అమెరికా భావిస్తోంది. ఈ పైలట్‌ ప్రాజెక్టును ఈ ఏడాది చివర్లో ప్రారంభించనుంది. ఇది పూర్తిగా అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులకు పెద్ద ఊరట కలగనుంది. 2004 వరకు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ కేటగిరీ వీసాల (ఎన్‌ఐవీ)ను, ముఖ్యంగా హెచ్‌1-బీలను అమెరికాలోనే పునరుద్ధరించేవారు. ఆ తర్వాత ఈ విధానాన్ని మార్చారు. వీసాల పునరుద్ధరణకు విదేశీ టెకీలు స్వదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాక వీసాల పునరుద్ధరణకు చాలా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ ఉద్యోగులకు వ్యయ ప్రయాసలు లేకుండా స్థానికంగా ఎన్‌ఐవీ వీసాలను పునరుద్ధరించాలని అమెరికా యోచిస్తోంది.

ఇది కూడా చదవండి: అమెరికా కీలక నిర్ణయం.. భారతీయులకు నెలల తరబడి నిరీక్షణ నుంచి ఉపశమనం!

Updated Date - 2023-02-11T07:58:31+05:30 IST