Eid Al Adha: యూఏఈలో భారీ వీకెండ్.. నివాసితులకు ఏకంగా 10 రోజుల సెలవులు
ABN , First Publish Date - 2023-05-28T08:10:58+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పౌరులు, నివాసితులకు జూన్ మాసంలో లాంగ్ వీకెండ్ (Long Weekend) వస్తోంది.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పౌరులు, నివాసితులకు జూన్ మాసంలో లాంగ్ వీకెండ్ (Long Weekend) వస్తోంది. ఈద్ అల్ అధా (Eid-al adha) పండుగ సందర్భంగా అక్కడి వారికి వరుసగా ఆరు రోజుల సెలవులు వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈద్ అల్ ఫితర్ తర్వాత రెండో సుదీర్ఘ విరామం ఇదే. తాజాగా ప్రభుత్వం నాలుగు రోజుల సెలవులు ప్రకటించింది. ఇందులో ఒక రోజు అరఫా, మూడు రోజుల ఈద్ లీవ్స్ (Eid Holidays) ఉన్నాయి. ఇక ఖగోళ లెక్కల ప్రకారం యూఏఈలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల జుల్ హిజ్జా 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సెలవులు రానున్నాయి. అయితే, ఇది చంద్రవంక కనిపించే దానిపై ఆధారపడి ఉంటుంది.
కాగా, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం.. ఈద్ అల్ అధా జూన్ 27 నుంచి జూలై 2 వరకు జరుపుకోనున్నారు. అయితే, యూఏఈ (UAE) నివాసితులు ఈ ఆరు రోజుల విరామాన్ని 9 లేదా 10 రోజుల సెలవుగా మార్చుకోవచ్చు. వారు జూన్ 26న (సోమవారం) ఒక్క రోజు సెలవు (Leave) కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారి కంపెనీలు కూడా వారికి సెలవులు మంజూరు చేస్తే.. ఉద్యోగులు జూన్ 24 నుంచి జూలై 2వ తేదీ వరకు 9 రోజులు సెలవుల్లో (Holidays) ఉండొచ్చు. ఇక షార్జాలోనైతే ఏకంగా 10 రోజుల సెలవులు వస్తాయి. ఇక్కడ నాలుగు రోజుల పని విధానం ఉండడమే దీనికి కారణం. కాగా, ఇస్లామిక్ క్యాలెండ్ చాంద్రమాన వ్యవస్థపై ఆధారపడినందున జూన్‌లో జుల్ హిజ్జా చంద్రుడు కనిపించిన తర్వాత ధృవీకరించిన తేదీలు వెల్లడిస్తారు.