UAE: ప్రవాసులూ.. ఏ ప్రభుత్వ ఆఫీస్‌కు వెళ్లకుండా.. 24గంటల్లో బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు..!

ABN , First Publish Date - 2023-02-25T12:00:49+05:30 IST

ప్రవాసులు, నివాసితులు ఇంట్లోంచి కాలు బయటకు కదపకుండా, ఏ ప్రభుత్వ ఆఫీసుల చుట్టు తిరిగే అవసరం లేకుండా కేవలం 24 గంటల్లోనే జనన, మరణ ధృవపత్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది యూఏఈ ప్రభుత్వం.

UAE: ప్రవాసులూ.. ఏ ప్రభుత్వ ఆఫీస్‌కు వెళ్లకుండా.. 24గంటల్లో బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు..!

అబుదాబి: ప్రవాసులు, నివాసితులు ఇంట్లోంచి కాలు బయటకు కదపకుండా, ఏ ప్రభుత్వ ఆఫీసుల చుట్టు తిరిగే అవసరం లేకుండా కేవలం 24 గంటల్లోనే జనన, మరణ ధృవపత్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది యూఏఈ ప్రభుత్వం. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో సంబంధిత ధృవపత్రం జారీ చేయడం జరుగుతుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ గురువారం ప్రకటించింది. దీనికోసం ప్రత్యేక డిజిటల్ సర్వీస్‌ను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయని పేర్కొంది. ఇక సర్వీస్ పొందేందుకు వినియోగదారులు ఒక్కొ సర్టిఫికేట్‌కు 60 దిర్హమ్స్ (రూ.1,354) చొప్పున చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ సేవల కారణంగా వినియోగదారుల సమయం వృథాకాకుండా ఉండడంతో పాటు అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదని, అది కూడా ఒక వర్కింగ్ డేలో సర్టిఫికేట్ జారీ కావడం అనేది నిజంగా అద్భుతం అని మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యావసరంగా సర్టిఫికేట్లు కావాల్సిన సమయంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ప్రవాసులకు బర్త్ సర్టిఫికేట్ దరఖాస్తుకు కావాల్సిన ధృవ పత్రాలు..

* నవజాత శిశువు తల్లిదండ్రుల నుండి డిక్లరేషన్ పత్రం. అది కూడా వారు ఏ దేశానికి చెందినవారో ఆ దేశ రాయబార కార్యాలయం లేదా నోటరీ పబ్లిక్ ద్వారా ధృవీకరించబడినదే ఉండాలి. అలాగే పేరెంట్స్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్న కూడా చెల్లుతుంది.

* ఐడీ కార్డు, పాస్‌పోర్టు (తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరిది ఉన్న సరిపోతుంది).

* పుట్టిన స్థలం, తేదీ మరియు తల్లిదండ్రుల పేర్లతో సహా కోర్టు నుండి ఒక లేఖ.

ఇది కూడా చదవండి: అయ్యో అయ్యయ్యో.. కోడి కోసం వెళ్లి.. పులి బోనులో చిక్కుకున్నాడు.. ఊరి జనం ఆడేసుకున్నారు.!

Updated Date - 2023-02-25T12:00:51+05:30 IST