Indian Ambassador: కువైత్ రెడ్ క్రెసెంట్ సొసైటీని సందర్శించిన భారత రాయబారి
ABN , First Publish Date - 2023-09-13T12:44:28+05:30 IST
కువైత్‌లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా (Dr. Adarsh Swaika) మంగళవారం కువైత్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (Kuwait Red Crescent Society) ని సందర్శించారు.
కువైత్ సిటీ: కువైత్‌లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా (Dr. Adarsh Swaika) మంగళవారం కువైత్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (Kuwait Red Crescent Society) ని సందర్శించారు. వరల్డ్‌వైడ్‌గా మానవత, సహాయక చర్యల్లో ఈ సోసైటీ పాత్రను ఈ సందర్భంగా అంబాసిడర్ ప్రశంసించారు. అలాగే ప్రకృతి, మానవ నిర్మిత విపత్తుల వల్ల ప్రభావితమైన వారికి ఈ సంస్థ నిరంతరం మద్దతునిస్తుందని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేఆర్‌సీఎస్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ డా. హిలాల్ అల్-సయ్యేర్‌తో భేటీ అయ్యారు. తన కేఆర్‌సీఎస్ పర్యటన సమయంలో ఇరుపక్షాల మధ్య సంబంధాలను మెరుగుపరచడం, మానవతా రంగంలో సహకారం, సమన్వయంపై చర్చించినట్లు రాయబారి పేర్కొన్నారు. కేఆర్‌సీఎస్ ప్రధాన కార్యాలయానికి భారత అంబాసిడర్ రావడాన్ని అల్ సయ్యేర్ స్వాగతించారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, వివాదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టపోయిన జనాలకు మద్దతును అందించే లక్ష్యంతో కేఆర్‌సీఎస్ ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. ఈ సంస్థ లక్ష్యాలను సాధించడానికి ఇరుపక్షాల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొదించడానికి తాను ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.