NRI: కెనడియన్ పార్లమెంట్‌లో దీపావళి వేడుకలు.. పార్లమెంట్ భవనంపై హిందూ జెండా రెపరెపలు
ABN , First Publish Date - 2023-11-07T11:26:44+05:30 IST
ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఎజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో ఒట్టావాలోని కెనడియన్ పార్లమెంట్ హిల్ (Candian Parliament Hill) లో ఆదివారం (నవంబర్ 5న) దీపావళి వేడుకలు జరగడం విశేషం.
ఎన్నారై డెస్క్: ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఎజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో ఒట్టావాలోని కెనడియన్ పార్లమెంట్ హిల్ (Candian Parliament Hill) లో ఆదివారం (నవంబర్ 5న) దీపావళి వేడుకలు జరగడం విశేషం. ఈ సందర్భంగా పార్లమెంట్ భవనంపై 'ఓం' అని రాసి ఉన్న హిందూ జెండాను సైతం ఎగురువేశారు. ఇండో-కెనడియన్ చట్టసభ్యుడు చంద్రశేఖర్ ఆర్య (Indian Candian Lawmaker Chandrasekhar Arya) ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు కర్ణాటకు చెందిన చంద్రశేఖర్ ఆర్య తెలిపారు. ఆదివారం వైభవంగా జరిగిన ఈ వేడుకలకు ఒట్టావా (Ottawa), గ్రేటర్ టొరంటో, మాంట్రియల్ నగరాల నుంచి భారీ మొత్తంలో భారతీయులు (Indians) హాజరైనట్లు ఆయన చెప్పారు.
Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..
"పార్లమెంట్ హిల్‌పై దీపావళి (Diwali) ని నిర్వహించడం సంతోషంగా ఉంది. పార్లమెంటు హిల్‌పై హిందూ పవిత్ర చిహ్నం ఓమ్ జెండా (Om Flag) ను ఎగురవేయడానికి మేము ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాము. ఒట్టావా, గ్రేటర్ టొరంటో, మాంట్రియల్‌తో పాటు కెనడాలోని ఇతర నగరాల నుంచి భారీగా భారత ప్రవాసులు తరలి వచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 67 హిందూ, ఇండో-కెనడియన్ సంఘాలు ఈ వేడుకలకు మద్ధతు తెలిపాయి. ఇది ఎంతో హర్షించదగిన విషయం. అంతేగాక ఈ ఏడాది అదనపు ఆనందం ఏంటంటే.. కెనడా అంతటా హిందూ వారసత్వ మాసంలో దీపావళి కూడా భాగం కావడం. ఈ వేడుకల్లో అద్భుతమైన ప్రదర్శనలు చేసిన కళాకారులకు ధన్యవాదాలు. వేడుకలు విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు" అని చంద్రశేఖర్ ఆర్య ట్వీట్ చేశారు.