Mahzooz draw: లాటరీ రూపంలో వరించిన అదృష్టం.. ఇద్దరు భారతీయ ప్రవాసులకు జాక్‌పాట్.. ఎంత గెలుచుకున్నారంటే..

ABN , First Publish Date - 2023-05-11T08:47:38+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) నివాసముండే భారత ప్రవాసుడు (Indian Expat) సుమైర్ 2020లో కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయాడు.

Mahzooz draw: లాటరీ రూపంలో వరించిన అదృష్టం.. ఇద్దరు భారతీయ ప్రవాసులకు జాక్‌పాట్.. ఎంత గెలుచుకున్నారంటే..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) నివాసముండే భారత ప్రవాసుడు (Indian Expat) సుమైర్ 2020లో కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. దాంతో ఉన్న ఒక ఆధారం కోల్పోయి ఆదాయం లేక రెండేళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత గతేడాది ఖతార్‌లోని (Qatar) ఓ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో సూపర్ వైజర్‌గా చేరాడు. ఇక ఆరేళ్లుగా యూఏఈలో ఉంటున్న అతడు 2021 నుంచి క్రమం తప్పకుండా మహాజూజ్ డ్రాలో (Mahzooz draw) పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన మహాజూజ్ 126వ వీక్లీ డ్రాలో సుమైర్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏకంగా 1మిలియన్ దిర్హమ్స్ (రూ.2.23కోట్లు) గెలుచుకున్నాడు.

ఈ సందర్భంగా సుమైర్ మాట్లాడుతూ.. "నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా అద్భుతం. ఇక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనేది నా కల. ఇప్పుడది నిజం కానుంది. సరైన సమయంలో నాకు దక్కిన భారీ మొత్తం ఇది. తప్పకుండా ఈ నగదును సద్వినియోగం చేసుకుంటా. నేను భారీ మొత్తం గెలిచినట్లు నా భార్యకు తెలియజేసినప్పుడు, ఆమె మొదట నమ్మలేదు. కానీ నేను నా మహాజూజ్ ఖాతా స్క్రీన్‌షాట్‌ను ఆమెకు పంపించాను. దాంతో ఆమె నన్ను నమ్మింది. మా కుటుంబం మొత్తం చాలా ఆనందంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.

Eid Al Adha: వరుసగా ఆరు రోజులు సెలవులు.. లాంగ్‌ వీకెండ్‌ను భారీగా ప్లాన్ చేసుకుంటున్న ఉద్యోగులు

మరో భారతీయ ఇంజనీర్‌కు కూడా జాక్‌పాట్..

ఖతార్‌లోని మరో భారతీయ ప్రవాసుడు షహబాజ్‌కు సైతం జాక్‌పాట్ తగిలింది. తాజా వారాంతపు డ్రాలో అతడు 1మిలియన్ దిర్హమ్స్ (రూ.2.23కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో మెకానికల్ ఇంజనీర్ అయిన షహబాజ్ తొమ్మిదో గ్యారంటీ మిలియనీర్ అయ్యాడు. అతను రెండు సంవత్సరాలుగా మహాజూజ్‌లో చురుకుగా పాల్గొన్నాడు. అయితే మే 6న తీసిన డ్రాలో అతనికి అదృష్టం వరించింది. "నేను నా స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో లైవ్ డ్రాను చూశాను. స్క్రీన్‌పై నా పేరు చూడగానే ఎగిరిగంతేశాను" అని షాహబాజ్ చెప్పాడు. ఇక ప్రస్తుతం భారతదేశంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న తన భార్యకు తన విజయం గురించి మొదట చెప్పినట్లు చెప్పుకొచ్చాడు.

Kuwait: ఆ దేశ కార్మికులకు కువైత్ బిగ్ షాక్.. అన్ని రకాల వీసాలు బంద్..!


Updated Date - 2023-05-11T08:47:56+05:30 IST