Eid Al Adha: వరుసగా ఆరు రోజులు సెలవులు.. లాంగ్‌ వీకెండ్‌ను భారీగా ప్లాన్ చేసుకుంటున్న ఉద్యోగులు

ABN , First Publish Date - 2023-05-09T13:41:21+05:30 IST

ఈద్ అల్ అధా (Eid Al Adha) కోసం వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) నివాసితులకు వరుసగా 6 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి.

Eid Al Adha: వరుసగా ఆరు రోజులు సెలవులు.. లాంగ్‌ వీకెండ్‌ను భారీగా ప్లాన్ చేసుకుంటున్న ఉద్యోగులు

అబుదాబి: ఈద్ అల్ అధా (Eid Al Adha) కోసం వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) నివాసితులకు వరుసగా 6 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ఏప్రిల్‌లో రంజాన్ (Ramdan) తర్వాత ఈ ఏడాదిలో ఇది రెండో అతి పెద్ద లాంగ్ వీకెండ్ అని చెప్పొచ్చు. ఇక ఈద్ అల్ అధా సందర్భంగా ప్రభుత్వం 4 రోజుల సెలవులను ప్రకటించింది. ఇందులో ఒక రోజు అరఫా, మూడు రోజుల ఈద్ (Eid) ఉన్నాయి. కాగా, ఖగోళ గణనల ఆధారంగా యూఏఈలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల జుల్ హిజ్జా 9 నుంచి 12వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అలాగే ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం.. ఈద్ అల్ అదా జూన్ 27 నుంచి జూలై 2 వరకు జరుపుకోనున్నారు.

అయితే, యూఏఈ నివాసితులు ఈ 6 రోజుల వీకెండ్‌ను 9 లేదా 10 రోజుల సెలవులుగా మార్చుకునే అవకాశం ఉంది. జూన్ 26న ఒకరోజు సెలవు కోసం దరఖాస్తు చేసుకుంటే.. దీనికి ఒకవేళ ఆయా కంపెనీలు కూడా ఆమోదం తెలిపితే మాత్రం ఎమిరేట్‌లోని ఉద్యోగులు జూన్ 24 నుంచి జూలై 2 వరకు తొమ్మిది రోజులు పాటు సెలవుల్లో ఉండొచ్చు. మరోవైపు షార్జాలో (Sharjah) పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 10రోజుల విరామం పొందే వీలు ఉంది. ఎందుకంటే ఇక్కడ వారానికి నాలుగు రోజుల పని విధానం అమల్లో ఉంది. దీంతో ఈ రెండు ఎమిరేట్స్‌లలోని ఉద్యోగులు ఈ లాంగ్‌ వీకెండ్‌ను భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కువగా పొరుగు దేశాలకు విహారయాత్రలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు అక్కడి ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.

Kuwait: దజీజ్‌లో ప్రవాసుల కోసం మూడో హాస్పిటల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్


Updated Date - 2023-05-09T13:42:26+05:30 IST