Indian expat: భారతీయ వ్యక్తికి జాక్‌పాట్.. లాటరీలో రూ.8 కోట్లు గెలుచుకున్నాడు.. తీరా రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేస్తే..!

ABN , First Publish Date - 2023-09-14T09:19:11+05:30 IST

దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్‌ (Dubai Duty Free Millennium Millionaire) లో భార‌తీయుడు జాక్‌పాట్ కొట్టాడు. భార‌తీయ వ్యక్తి సయ్యద్ అలీ బతుషా తివంశ (Syed Ali Bathusha Thivansha) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియ‌న్ డాల‌ర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు.

Indian expat: భారతీయ వ్యక్తికి జాక్‌పాట్.. లాటరీలో రూ.8 కోట్లు గెలుచుకున్నాడు.. తీరా రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేస్తే..!

దుబాయి: దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్‌ (Dubai Duty Free Millennium Millionaire) లో భార‌తీయుడు జాక్‌పాట్ కొట్టాడు. భార‌తీయ వ్యక్తి సయ్యద్ అలీ బతుషా తివంశ (Syed Ali Bathusha Thivansha) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియ‌న్ డాల‌ర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో అలీ బతుషా రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు. బుధవారం దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం (Dubai International Airport) లోని టెర్మినల్-2 వద్ద నిర్వహించిన లక్కీ డ్రాలో మనోడు కొనుగోలు చేసిన టికెట్ నెం. 4392కు ఈ జాక్‌పాట్ త‌గిలింది. యూఏఈలో ఉండే అలీ బతుషా ఆగస్టు 30వ తారీఖున ఆన్‌లైన్‌లో అతడు ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అలా సరదాగా కొన్న లాటరీ టికెట్ ఇప్పుడు అతడికి కోట్లు తెచ్చిపెట్టింది.

కాగా, బుధవారం నిర్వహించిన డ్రాలో ఆన్‌లైన్‌లో కొన్న టికెట్‌కు లాటరీ తగలడంతో నిర్వాహకులు అతడి ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. కానీ, కలవలేదు. దాంతో ఇతర మార్గాల్లో అతనికి ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వాహకులు వెల్లడించారు. ఇక‌ 1999లో ప్రారంభ‌మైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 1 మిలియ‌న్ డాల‌ర్లు గెలుచుకున్న భార‌తీయుల్లో అలీ బతుషా 215వ వ్య‌క్తి. కాగా, ఈ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టికెట్ల కొనుగోలుదారుల్లో అత్యధికులు భార‌తీయులేన‌ని రాఫెల్ నిర్వాహ‌కులు తెలిపారు.

Indian Embassy in Kuwait: భారతీయ కార్మికులకు ఎంబసీ కీలక సూచన.. ఎట్టిపరిస్థితుల్లో ఆ పని చేయొద్దంటూ..


Updated Date - 2023-09-14T09:19:11+05:30 IST