US Embassy: ఖలిస్థానీ మద్దతుదారుల దుశ్చర్య.. ఎంబసీ బయట భారతీయ జర్నలిస్టుపై దాడి.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-03-26T12:52:13+05:30 IST
ఖలిస్థానీ మద్దతుదారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భారతీయ జర్నలిస్టుపై (Indian Journalist) దాడి చేశారు.
వాషింగ్టన్: ఖలిస్థానీ మద్దతుదారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భారతీయ జర్నలిస్టుపై (Indian Journalist) దాడి చేశారు. వాషింగ్టన్‌లోని (Washington) భారత ఎంబసీ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఖలిస్థానీ మద్దతుదారులను (Khalistan Supporters) కవర్ చేసేందుకు జర్నలిస్ట్ లలిత్ ఝా (Lalith Jha) వెళ్లారు. అయితే, మద్దతుదారులు ఒక్కసారిగా జర్నలిస్ట్‌పై దాడికి దిగారు. నోటికి వచ్చినట్లు తిట్టారు. తనను తిడుతూ, దాడికి పాల్పడినట్లు లలిత్ ఝా తెలిపారు. ఈ దాడిలో తన చెవికి తీవ్ర గాయమైందన్నారు. ఆ సమయంలో తనకు రక్షణ కల్పించి తన పనిలో సహకరించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులకు ఆయన ఆదివారం ధన్యవాదాలు తెలియజేశారు.
కాగా, శనివారం వాషింగ్టన్‌లోని భారత ఎంబసీ వద్ద ఆందోళన కోసం వాషింగ్టన్ డీసీ, మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల నుంచి ఖలిస్థానీ మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. ఇంగ్లీష్, పంబాబీలో భారత వ్యతిరేక నినాదాలు చేశారు. పంజాబ్ పోలీసులు మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌కు (Amritpal Singh) మద్దతుగా 'ఫ్రీ అమృత్ పాల్' అంటూ నినాదాలు చేశారు. అటు భారత ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని దుర్భాషలాడారు.
ఇది కూడా చదవండి: 'ఐఫోన్ 14' కొనేందుకు 12ఏళ్ల అమ్మాయి.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!
ఇక భారతీయ జర్నలిస్టుపై దాడిని ఎంబసీ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఖలిస్థానీ వేర్పాటువాదులు సంఘ వ్యతిరేక విధ్వంస చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలాఉంటే.. గత తొమ్మిది రోజులుగా పంజాబ్ పోలీసుల నుంచి అమృత్ పాల్ సింగ్ తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. దాంతో అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పాక్ ఐఎస్ఐతో సంబంధాలు, సొంత ఆర్మీని ఏర్పాటు చేసుకుని పంజాబ్‌లో దాడులకు పాల్పడి అశాంతి సృష్టించాలనేది అతడి ప్లాన్‌గా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నేపాల్ మీదుగా కెనడా పారియేందుకు అమృత్ పాల్ సింగ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: భారత్‌కు భారతీయ అమెరికన్ల మద్దతు.. 'మీరు మా సోదరులు.. రండి మాతో కలవండి'