Indian Mission: బహ్రెయిన్‌లోని భారత ప్రవాసులకు ఎంబసీ కీలక సూచన.. కాన్సులర్, వీసా సేవల కోసం ఇకపై..
ABN , First Publish Date - 2023-08-27T10:12:49+05:30 IST
బహ్రెయిన్ (Bahrain) లోని భారత రాయబార కార్యాలయం ప్రవాసులకు తాజాగా నిర్వహించిన 'ఓపెన్ హౌస్' కార్యక్రమం సందర్భంగా కీలక సూచన చేసింది.
![Indian Mission: బహ్రెయిన్‌లోని భారత ప్రవాసులకు ఎంబసీ కీలక సూచన.. కాన్సులర్, వీసా సేవల కోసం ఇకపై..](https://media.andhrajyothy.com/media/2023/20230730/Indians_in_Bahrain_427da9129a.jpg)
మనామా: బహ్రెయిన్ (Bahrain) లోని భారత రాయబార కార్యాలయం ప్రవాసులకు తాజాగా నిర్వహించిన 'ఓపెన్ హౌస్' కార్యక్రమం సందర్భంగా కీలక సూచన చేసింది. రాయబారి వినోద్ కురియన్ జాకబ్ (Vinod Kurian Jacob) అధ్యక్షతన జరిగిన ఈ పబ్లిక్ మీటింగ్‌కు ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 75 మందికి పైగా భారతీయ ప్రవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయబారి కీలక సూచన చేశారు. ఇండియన్ ఎంబసీ (Indian Embassy), ఐవీఎస్ (IVS) గ్లోబల్‌లో కూడా కాన్సులర్, వీసా సేవలను పొందేందుకు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌ల కోసం కొత్త మొబైల్ యాప్ 'EolBh Connect' ను డౌన్‌లోడ్ చేసుకోవాలని భారత ప్రవాసులను వినోద్ కురియన్ కోరారు. భారతీయ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా అవసరమైన వారికి బోర్డింగ్, వసతిని అందించడంతో పాటు అత్యవసర ధృవీకరణ పత్రాలు, విమాన టికెట్‌లను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. తద్వారా కష్టాల్లో ఉన్న భారతీయులకు ఎంతోకొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.