Dubai: ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడ్డ భారతీయ మహిళ.. నాలుగేళ్లుగా కారులోనే మకాం.. చివరికి
ABN , First Publish Date - 2023-04-22T08:51:18+05:30 IST
ఆర్థిక సమస్యల కారణంగా గడిచిన నాలుగేళ్లుగా కారులోనే జీవిస్తున్న 55 ఏళ్ల భారతీయ మహిళ ప్రియా ఇంద్రు మణికి (Priya Indru Mani) దుబాయిలోని భారతీయ కాన్సులేట్ జనరల్ (Consulate General of India) ఆదుకుంది.
దుబాయి: ఆర్థిక సమస్యల కారణంగా గడిచిన నాలుగేళ్లుగా కారులోనే జీవిస్తున్న 55 ఏళ్ల భారతీయ మహిళ ప్రియా ఇంద్రు మణికి (Priya Indru Mani) దుబాయిలోని భారతీయ కాన్సులేట్ జనరల్ (Consulate General of India) ఆదుకుంది. కష్టకాలంలో ఆమెను ఆర్థిక సాయం చేసి అండగా నిలిచింది. తల్లికి పక్షవాతం రావడం, బిజినెస్‌లో భారీగా నష్టాలు చవిచూడడంతో ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారింది. దుబాయిలోని బార్షా హైట్స్‌లోని డెసర్ట్ స్ప్రింగ్స్ విలేజ్‌లోని తన విల్లాకు అద్దె చెల్లించలేకపోయింది. దాంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఓ హోటల్‌లో కొన్ని రోజులు ఉంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారడంతో తన కారులో నివసించవలసిన పరిస్థితి దాపురించింది.
ఈ నేపథ్యంలో తన గోడును భారతీయ కాన్సులేట్ ముందు వెళ్లబోసుకుని తనకు సహాయం చేయాల్సిందిగా అధికారులను వేడుకుంది. దాంతో కాన్సులేట్ అధికారులు విల్లా యజమానితో మాట్లాడారు. ఆ తర్వాత దుబాయి ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (Dubai Electricity and Water Authority) బాకీతో సహా ఆమె మిలిగిన అప్పులను తీర్చడానికి అనేక మంది వ్యక్తులు ముందుకు వచ్చారు. కార్ ఫేర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బస్సీ (MD of Car Fare Group Jasbir Bassi) అద్దె కోసం 50వేల దిర్హమ్స్ (రూ.11.17లక్షలు)తో పాటు ఎలక్ట్రిసిటీ ఛార్జీల కోసం 30వేల దిర్హమ్స్ (రూ.6.70లక్షలు) అందించారు.
H-1B Visa: అలా చేస్తే యూఎస్‌కు భారీగా భారత ఐటీ నిపుణులు వస్తారు.. భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడి సూచన
దాతల సహకారం కారణంగా కాన్సులేట్ సమన్వయంతో మణికి ఆర్థిక ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా తనకు సహకరించిన వారికి మణి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని ఇచ్చారని ఆమె పేర్నొ్న్నారు. మణి పరిస్థితిని పరిష్కరించడంలో సానుభూతితో సహకరించినందుకు వినయ్ చౌదరి, అనీష్ విజయన్, జస్బీర్ బస్సీలకు కాన్సులేట్ హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. ఇలాంటి చొరవలు యూఏఈలో భారతీయ సమాజంలోని (Indian Community) బలమైన బంధాలకు ఉదాహరణంగా నిలుస్తాయని కాన్సులేట్ పేర్కొంది.