Indian Origin Billionaire: బ్రిటన్‌లో ఆలయం కోసం భారతీయ బిలియనీర్ భారీ విరాళం

ABN , First Publish Date - 2023-04-26T10:22:33+05:30 IST

బ్రిటన్‌లో తొలి జగన్నాథ స్వామి ఆలయం (Jagannath Temple) నిర్మాణానికి రూ.250కోట్లు అందించనున్నట్లు భారత సంతతికి చెందిన బిలియనీర్ (Indian Origin Billionaire) బిశ్వనాథ్ పట్నాయక్ ప్రకటించారు.

Indian Origin Billionaire: బ్రిటన్‌లో ఆలయం కోసం భారతీయ బిలియనీర్ భారీ విరాళం

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లో తొలి జగన్నాథ స్వామి ఆలయం (Jagannath Temple) నిర్మాణానికి రూ.250కోట్లు అందించనున్నట్లు భారత సంతతికి చెందిన బిలియనీర్ (Indian Origin Billionaire) బిశ్వనాథ్ పట్నాయక్ ప్రకటించారు. శ్రీ జగన్నాథ్ సొసైటీ అనే ఛారిటీకి ఈ మొత్తాన్ని అందించనున్నారు. విదేశాల్లో ఆలయ నిర్మాణానికి ఇంత మొత్తంలో విరాళం అందించడం ఇదే తొలిసారి. ఒడిషాకు చెందిన బిశ్వనాథ్.. లండన్‌లో ఫిన్‌నెస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్. యూకేలో స్థిరపడిన బిశ్వనాథ్ పట్నాయక్ (Biswanth Patnaik) లండన్ శివారులో జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణం కోసం ఇలా భారీ మొత్తం విరాళంగా ఇచ్చారు.

ఇక ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానికులు శ్రీ జగన్నాథ సొసైటీ ఆఫ్ యూకేగా ఏర్పడ్డారు. ఈ సొసైటీ ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా ప్రజల నుండి విరాళాలు సేకరిస్తున్నారు. ఇటీవల అక్షయ తృతీయ రోజున ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బిశ్వనాథ్‌ను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగానే ఆయన భారీ విరాళం ప్రకటించారు. దాదాపు 15 ఏకరాల్లో ఈ టెంపుల్ నిర్మించనున్నారు. 2024 చివరి నాటికి ఆలయం తొలి విడత నిర్మాణ పనులు పూర్తవుతాయట. ఇదిలాఉంటే.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (UK PM Rishi Sunak) తన ఎన్నికల ప్రచార సమయంలోనూ జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణానికి హామీ ఇచ్చారని సమాచారం.

Neeli Bendapudi: భారతీయ అమెరికన్ తెలుగు మహిళా విద్యావేత్తకు ప్రతిష్టాత్మక పురస్కారం


Updated Date - 2023-04-26T10:22:33+05:30 IST