Indian Origin: అమెరికాలో చరిత్ర సృష్టించిన భారత సంతతి సిక్కు మహిళ.. నిజంగా చాలా గ్రేట్!
ABN , First Publish Date - 2023-04-24T11:10:48+05:30 IST
అమెరికాలో భారత సంతతి సిక్కు మహిళ (Indian-origin Sikh woman) చరిత్ర సృష్టించింది.
ఎన్నారై డెస్క్: అమెరికాలో భారత సంతతి సిక్కు మహిళ (Indian-origin Sikh woman) చరిత్ర సృష్టించింది. అక్కడి పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ చీఫ్‌గా (Assistant Police Chief) బాధ్యతలు అందుకున్న తొలి సిక్కు మహిళగా మన్మీత్ కౌర్ (Manmeet Kaur) చరిత్రకెక్కారు. ఆమె స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని (Punjab) గురుదాస్‌పూర్ (Gurdaspur) జిల్లా భుల్లేచక్ గ్రామం (Bhullechak village). మన్మీత్ సాధించిన ఈ ఘనత పట్ల ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మన్మీత్ కౌర్ తండ్రి కుల్వంత్ సింగ్ (Kulwant Singh) మీడియాతో మాట్లాడారు.
తాను ఇండియన్ నేవీలో పనిచేసినట్లు చెప్పిన ఆయన.. తన కూతురు సైతం చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని నిర్ణయించుకుందని తెలిపారు. ముఖ్యంగా మన్మీత్‌కు కెరీర్ పట్ల ఉన్న ఇష్టమే ఇవాళ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ స్థాయికి చేరేలా చేసిందని చెప్పారు. చదువులో ఎంతో చురుగ్గా ఉండే మన్మీత్.. మొదటి నుంచి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (Federal Bureau of Investigation)లో పనిచేసిన బంధువులతో ప్రభావితమైందన్నారు. ఆమె 2024లో స్వదేశానికి రానున్నారని చెప్పిన కుల్వంత్ సింగ్.. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శిస్తారని చెప్పుకొచ్చారు.
US Visas: భారతీయులకు పండగలాంటి వార్త.. ఈ ఏడాది మనోళ్లకు భారీగా వీసాలు..!
కాగా, మన్మీత్ జలంధర్‌లోని గురురాందాస్ పబ్లిక్ స్కూల్‌లో (Guru Ramdas Public School) ఆరవ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత 1996లో ఆమె తన కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ 12వ తరగతి పూర్తి చేసిన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ (University of New Haven) నుంచి కమర్షియల్ లా చీఫ్ (Commercial Law Chief), మాస్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని (Master of Laws Degree) పొందారు. మన్మీత్ ఎట్టకేలకు 2008లో పోలీస్ శాఖలో (Police Force) చేరి, తన జీవితాశయాన్ని నెరవేర్చుకున్నారు. అనతికాలంలోనే తన పనితనంతో సమర్ధురాలైన అధికారిగా పేరు తెచ్చుకుని, ఇప్పుడు ఏకంగా అసిస్టెంట్ పోలీస్ చీఫ్ స్థాయికి చేరుకున్నారు. నిజంగా చాలా గ్రేట్. ఓ మహిళ అయ్యి ఉండి, అందులోనూ విదేశీయురాలిగా అమెరికాలో ఈ స్థాయికి చేరడమంటే మాటలు కాదు. హ్యాట్సాఫ్ టు మన్మీత్ కౌర్.