South Africa: భర్త నుంచి రూ.90 లక్షల కొట్టేయడానికి కిడ్నాప్ డ్రామా.. సీన్ రివర్స్ కావడంతో అడ్డంగా దొరికిపోయిన భారతీయ మహిళ

ABN , First Publish Date - 2023-04-08T09:11:31+05:30 IST

దక్షిణాఫ్రికాలో ఓ భారత సంతతి మహిళ (Indian Origin Woman) నిర్వాకానికి పాల్పడింది.

South Africa: భర్త నుంచి రూ.90 లక్షల కొట్టేయడానికి కిడ్నాప్ డ్రామా.. సీన్ రివర్స్ కావడంతో అడ్డంగా దొరికిపోయిన భారతీయ మహిళ

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో ఓ భారత సంతతి మహిళ (Indian Origin Woman) నిర్వాకానికి పాల్పడింది. భర్త నుంచి భారీ మొత్తంలో డబ్బు కొట్టేయడానికి కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని (Kidnapped) భర్తకు ఫోన్ చేసిన భార్య.. విడుదల చేయాలంటే 2 మిలియన్ రాండ్స్ (దాదాపు రూ.90 లక్షలు) డిమాండ్ చేస్తున్నారని చెప్పింది. అయితే, చివరకు పీటర్‌మారిట్జ్‌బర్గ్ నగరంలోని ఓ హోటల్‌లో ఆమె ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. భర్త నుంచి డబ్బులు కొట్టేయడానికే ఆమె ఇలా మాస్టర్ ప్లాన్ వేసినట్టు గ్రహించారు. దాంతో సదరు భారతీయ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డర్బన్‌కు (Durban) ఉత్తరాన ఉన్న ఫీనిక్స్‌కు చెందిన 47 ఏళ్ల ఫిరోజా బీ జోసెఫ్ (Firoza Bee Joseph) పీటర్‌మారిట్జ్‌బర్గ్‌( Pietermaritzburg) లోని ఓ హోటల్ గదిలో పోలీసులకు కనిపించింది. ఈ కేసుకు సంబంధించి జూన్ 7న తదుపరి కోర్ట్ విచారణ వరకు ఆమెకు బెయిల్ మంజూరు చేసినట్లు నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ ప్రతినిధి నటాషా కారా (National Prosecuting Authority spokesperson Natasha Kara) తెలిపారు. కిడ్నాప్‌కు సంబంధించి ఫిరోజా చెప్పినదంతా అబద్ధమని పోలీసులు తేల్చారు.

ఫిరోజా కిడ్నాప్‌కు (Kidnapping) గురైనట్లు ఆమె భర్తకు సోమవారం కాల్ వచ్చిందట. తనను విడుదల చేయాలంటే డబ్బును ఇవ్వాలని చెప్పినట్లు పోలీస్ ప్రతినిధి కల్నల్ రాబర్ట్ నెట్‌షిండా (Colonel Robert Netshiunda) తెలిపారు. ఛార్జ్‌షీట్ ప్రకారం ఆ మొత్తం 2 మిలియన్ ర్యాండ్‌లుగా తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఫీనిక్స్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లోని ఒక కాసినోలో ఫిరోజా ఉన్న ఫుటేజీని గుర్తించారు. మారుపేరుతో హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్న ఆమె.. బెడ్‌‌పై కూర్చుని బ్రేక్‌ఫాస్ట్ తింటుండగా పోలీసులు అక్కడకు వెళ్లడంతో గుట్టురట్టయ్యింది. అంతేకాకుండా కిడ్నాపర్లు తన ఆభరణాలన్నీ ఎత్తుకెళ్లారని ఆమె చెప్పిన మాట కూడా అబద్ధమని పోలీసులు నిర్ధారించారు.

Eid Al Fitr: ఈద్ అల్ ఫితర్‌కు గల్ఫ్ దేశాల్లో 9రోజుల లాంగ్ వీకెండ్..?


Updated Date - 2023-04-08T09:11:31+05:30 IST