Hit-and-Run: భారతీయ విద్యార్థికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఆస్ట్రేలియా కోర్టు.. కానీ..

ABN , First Publish Date - 2023-05-21T08:28:56+05:30 IST

ఆస్ట్రేలియాలో (Australia) ఉంటున్న భారతీయ విద్యార్ధికి హిట్ అండ్ రన్ కేసులో (Hit-And-Run) భారీ ఊరట లభించింది.

Hit-and-Run: భారతీయ విద్యార్థికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఆస్ట్రేలియా కోర్టు.. కానీ..

సిడ్నీ: ఆస్ట్రేలియాలో (Australia) ఉంటున్న భారతీయ విద్యార్ధికి హిట్ అండ్ రన్ కేసులో (Hit-And-Run) భారీ ఊరట లభించింది. ఆస్ట్రేలియా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు 18 ఏళ్ల వంశ్ ఖన్నాను (Vansh Khanna) గురువారం లేన్ కోవ్‌లోని ఫాక్స్ స్ట్రీట్‌లో అరెస్ట్ చేసి చాట్స్ వుడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం మ్యాన్లీ లోకల్ కోర్టులో అతడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఖన్నాను ఎప్పుడూ పిలిచిన పోలీస్ స్టేషన్‌కు రావడంతో పాటు కారు నడపకూడదు, పాస్‌పోర్ట్‌ అప్పగించాలి వంటి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..

సిడ్నీలో (Sydney) గురువారం ఈ ప్రమాదం జరిగింది. 12 నుంచి 13 ఏళ్ల వయసున్న ముగ్గురు స్కూల్ పిల్లలు (Schoolboys) రోడ్డు దాటుతున్న సమయంలో వంశ్ ఖన్నా డ్రైవ్ చేస్తున్న కారు వారిని బలంగా ఢీ కొట్టింది. దీనిపై సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ బృందాలు తక్షణం ఘటనాస్థలికి చేరుకున్నాయి. న్యూ సౌత్ వేల్స్‌ పారామెడిక్స్ వారికి చికిత్స అందించారు. అనంతం పిల్లల కాలు, తలపై గాయాలు కావడంతో వారిని సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు. అయితే, ప్రమాదం జరిగిన తర్వాత కారు నడిపిన వ్యక్తి కనీసం ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

WhatsApp: ఎల్లలు దాటిన వాట్సాప్ సందేశం.. ఆఫ్రికాలో ఉన్న తండ్రికి తెలుగునాట తప్పిపోయిన బిడ్డ ఆచూకీ తెలిసిందిలా..


సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వంశ్ ఖన్నాను సిడ్నీ పోలీసులు (Sydney Police) అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిపై ఏడు అభియోగాలు మోపారు. వీటిలో ప్రమాదకర డ్రైవింగ్, హాని కలిగించే ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్, దుష్ప్రవర్తన, రెడ్ సిగ్నల్ జంప్, సహాయం చేయడంలో విఫలం తదితర అభియోగాలు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అతడు నడిపిన హోండా అకార్డ్‌ కారును మెకానికల్, ఫోరెన్సిక్ పరీక్షల కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ నోటీసు కూడా ఇచ్చారు. కాగా, జూన్ 8న వంశ్ ఖన్నా మరోసారి న్యాయస్థానం ఎదుట హాజరుకావాల్సి ఉంది.

Swastika symbol: 'స్వస్తిక్‌' గుర్తు తెచ్చిన తంటా.. సౌదీలో కటకటాల వెనక్కి తెలుగోడు..!

Updated Date - 2023-05-21T08:28:56+05:30 IST