Kuwait: కువైత్ అధికారుల ఆకస్మిక తనిఖీలు.. వందల మంది ప్రవాసులు అరెస్ట్!

ABN , First Publish Date - 2023-05-16T07:59:10+05:30 IST

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కువైత్ అధికారులు (Kuwait Officials) నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో వందల మంది ప్రవాసులు (Expats) పట్టుబడ్డారు.

Kuwait: కువైత్ అధికారుల ఆకస్మిక తనిఖీలు.. వందల మంది ప్రవాసులు అరెస్ట్!

కువైత్ సిటీ: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కువైత్ అధికారులు (Kuwait Officials) నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో వందల మంది ప్రవాసులు (Expats) పట్టుబడ్డారు. పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ సెక్టార్, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్‌లు సంయుక్తంగా వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున సడన్ సోదాలు నిర్వహించారు. ప్రధానంగా షువైఖ్ ఇండస్ట్రియల్ ప్రాంతం, హవల్లీ, ఖైతాన్, మహబూలా, ఖురైన్ మార్కెట్స్, జహ్రా పారిశ్రామిక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా రెసిడెన్సీ చట్టాన్ని (Residency Law) ఉల్లంఘించిన వారు 63 మంది, గడువు ముగిసిన రెసిడెన్సీ పర్మిట్లు (Expired Residency Permits) కలిగిన వారు 40 మంది, ఎలాంటి ధృవపత్రాలు లేనివారు 91 మంది, 23 మంది వ్యక్తులు పరారీలో ఉన్నారు, మరో ఇద్దరు క్రిమినల్ రికార్డులు కలిగిన వారు పట్టుబడ్డారని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. అలాగే మరో నలుగురు మాదకద్రవ్యాలను కలిగి ఉన్నారని, ఇద్దురు వ్యక్తులు మద్యంతో పట్టుబడ్డారు. ఇక ఓ వ్యక్తి ఏకంగా డ్రంగ్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా, ఈ సోదాలలో భాగంగా చిన్న చిన్న నేరాలకు పాల్పడిన 423 మంది ప్రవాసులను అధికారులు విడుదల చేశారు.

Kuwait: ఆ దేశ కార్మికులకు కువైత్ బిగ్ షాక్.. అన్ని రకాల వీసాలు బంద్..!

Updated Date - 2023-05-16T07:59:10+05:30 IST