UK: భారతీయ నర్సులకు బ్రిటన్ తీపి కబురు.. వచ్చే నాలుగేళ్లలో భారీ రిక్రూట్‌మెంట్‌.. మనోళ్లకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి!

ABN , First Publish Date - 2023-04-08T10:04:18+05:30 IST

భారతీయ నర్సులకు (Indian Nurses) బ్రిటన్‌కు చెందిన వేల్స్ మెడికల్ బోర్డు (Welfare Medical Board) తీపి కబురు చెప్పింది.

UK: భారతీయ నర్సులకు బ్రిటన్ తీపి కబురు.. వచ్చే నాలుగేళ్లలో భారీ రిక్రూట్‌మెంట్‌.. మనోళ్లకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి!

లండన్: భారతీయ నర్సులకు (Indian Nurses) బ్రిటన్‌కు చెందిన వేల్స్ మెడికల్ బోర్డు (Welfare Medical Board) తీపి కబురు చెప్పింది. వచ్చే 4ఏళ్లలో ఇండియా (India) నుంచి 900 మంది నర్సులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, కేరళకు (Kerala) చెందిన నర్సులకే ఇందులో తొలి ప్రాధాన్యత ఇస్తామని బోర్డు వెల్లడించింది. వేల్స్‌లోని స్వాన్సీ బే యూనివర్సిటీ హెల్త్ బోర్డ్ (Wales Swansea Bay University Health Board) ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ హాకెట్ (Mark Hackett) ఆదేశాలకు అనుగుణంగా 350 మంది విదేశీ నర్సులను రిక్రూట్‌ చేసుకోనుంది. 2023-24లో 350 మంది విదేశీ నర్సులను నియమించుకోవడానికి దాదాపు 4.7 మిలియన్ పౌండ్ల (రూ.47.79కోట్లు) ఖర్చవుతుందని అంచనా.

విదేశీ నర్సులకు బ్యాండ్ 5 కాంట్రాక్ట్ కింద 27,055 పౌండ్ల (రూ.27.51లక్షలు) ప్రారంభ వేతనంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే, వారు యునైటెడ్ కింగ్‌డమ్‌లో (United Kingdom) రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే వరకు బ్యాండ్ 4 వేతనాన్ని మాత్రమే ఇస్తారు. ప్రస్తుతం వేల్స్ హెల్త్ బోర్డులో 4,200 మంది నర్సులు, సహాయకులు పనిచేస్తున్నారు. నివేదిక ప్రకారం వీరిలో 1,322 మంది రాబోయే కొన్నేళ్లలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్, ఆఫ్రికా, కరేబియన్ దేశాల నుంచి నియామకాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇంగ్లాండ్‌లోని ఎన్‌హెచ్ఎస్‌లో భాగమైన హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లాండ్ (Health Education England) నర్సుల రిక్రూట్‌మెంట్, ట్రైనింగ్‌కు బాధ్యత వహిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో వెస్ట్ యార్క్ షైర్ ఇంటిగ్రేటెడ్ కేర్ సిస్టమ్ (West Yorkshire Integrated Care System)తో కలిసి శ్రామిక సంబంధాలను బలోపేతం చేస్తున్నట్లు హెచ్ఈఈ (HEE) తెలిపింది.

South Africa: భర్త నుంచి రూ.90 లక్షల కొట్టేయడానికి కిడ్నాప్ డ్రామా.. సీన్ రివర్స్ కావడంతో అడ్డంగా దొరికిపోయిన భారతీయ మహిళ


Updated Date - 2023-04-08T10:04:18+05:30 IST