Kuwait: ప్రవాసులకు మరో బిగ్ షాక్.. కువైత్‌లో ఆ సర్వీసులకు కొత్త ఫీజులు!

ABN , First Publish Date - 2023-05-07T09:30:36+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) మరోసారి ప్రవాసులకు బిగ్ షాక్ ఇచ్చింది. రక్త మార్పిడి (Blood Transfusion) సర్వీసులకు సంబంధించి కొత్త ఫీజులను ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.

Kuwait: ప్రవాసులకు మరో బిగ్ షాక్.. కువైత్‌లో ఆ సర్వీసులకు కొత్త ఫీజులు!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) మరోసారి ప్రవాసులకు బిగ్ షాక్ ఇచ్చింది. రక్త మార్పిడి (Blood Transfusion) సర్వీసులకు సంబంధించి కొత్త ఫీజులను ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. బ్లడ్ బ్యాగ్స్, వాటి సంబంధిత సేవలను స్వీకరించే ప్రవాసులు (Expatriates) ప్రతి బ్యాగ్‌కు 20 కువైటీ దీనార్ల (రూ.5336) రుసుము చెల్లించాల్సి ఉంటుందని తన ప్రకటనలో పేర్కొంది. అలాగే రక్తమార్పిడి సేవల విభాగానికి చెందిన ప్రయోగశాలలలో నిర్వహించబడే వివిధ లాబొరేటరీ పరీక్షలకు సైతం రుసుములు ఉంటాయని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

ఈ జాబితాలో 37 లాబొరేటరీ టెస్టులను చేర్చింది. ఇక రుసుము విషయానికి వస్తే హాఫ్ దీనార్ (రూ.133) నుంచి మొదలుకొని 15 కేడీల (రూ.4002) వరకు ఉంటుందని తెలిపింది. అయితే, ప్రతి బ్లడ్ బ్యాగ్ లేదా దాని డెరివేటివ్‌లకు దాత ఉంటే 20 కేడీల బ్లడ్ బ్యాగ్ రుసుము మినహాయింపు ఉంటుంది. ఇక విజిట్ వీసాపై (Visit Visa) ఉన్న ప్రవాసులకైతే రుసుము రెట్టింపు అవుతుంది. కాగా, అత్యవసర కేసులు, క్యాన్సర్ రోగులు, పిల్లలు, ఇతర మానవతా కేసులలో ప్రవాస రోగులు నుండి ఫీజు వసూలు చేయబడదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Texas Mall Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. టీనేజీ యువతి సహా 9 మంది మృతి!


Updated Date - 2023-05-07T09:30:36+05:30 IST