Kuwait: ప్రవాసులకు కీలక సూచన.. ఆ గైడ్‌లైన్స్ తప్పకుండా పాటించాల్సిందే..
ABN , First Publish Date - 2023-02-24T09:13:08+05:30 IST
కువైత్ జాతీయ దినోత్సవం (Kuwait National Day) సందర్భంగా వరుసగా సెలవులు (Holidays) రావడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలు (Traffic Violations) పెరిగే అవకాశం ఉన్నందున అంతర్గత మంత్రిత్వశాఖ ప్రవాసులు, నివాసితులకు తాజాగా కీలక సూచన చేసింది.
కువైత్ సిటీ: కువైత్ జాతీయ దినోత్సవం (Kuwait National Day) సందర్భంగా వరుసగా సెలవులు (Holidays) రావడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలు (Traffic Violations) పెరిగే అవకాశం ఉన్నందున అంతర్గత మంత్రిత్వశాఖ ప్రవాసులు, నివాసితులకు తాజాగా కీలక సూచన చేసింది. ప్రవాసులు, కువైటీలు ట్రాఫిక్ గైడ్‌లైన్స్‌ను తప్పకుండా పాటించాలని సూచించింది. ఇక వేడుకల సందర్భంగా వాహనం మొత్తాన్ని కవర్ చేసేలా డెకరేషన్ చేయకూడదని తెలిపింది. ముఖ్యంగా వాహనం అద్దాలపై పెయింటింగ్స్ వంటివి వేయకూడదని చెప్పింది. అలాగే నంబర్ ప్లేట్‌పై కూడా ఎలాంటి స్టిక్కర్స్ అతికించకూడదు. స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలని మంత్రిత్వశాఖ తెలిపింది. అంతేగాక వేడుకల సందర్భంగా వాహనాల కిటికీల నుంచి పిల్లలు బయటకు వేలాడడం, తొంగి చూడడం వంటి కూడా చేయకుండా పేరెంట్స్ జాగ్రత్త వహించాలని కోరింది. ఇతరులకు ఇబ్బంది కలగకుండా సేఫ్టీ రూల్స్ పాటించడం తప్పనిసరి అని మినిస్ట్రీ ఆఫ్ ఇంటరీయర్‌కు చెందిన పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా విభాగం చెప్పుకొచ్చింది.
ఇదిలాఉంటే.. నేషనల్ డే సందర్భంగా వచ్చిన వరుస సెలవుల కారణంగా ప్రవాసులు, కువైటీలు భారీ మొత్తంలో విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతో ఒక్కసారిగా విమాన చార్జీలు భారీగా పెరిగాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ప్రధానంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు, టర్కీ, లండన్, కైరో, బీరూట్ తదితర గమ్యస్థానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో విమాన టికెట్ల ధరలకు (Flight Ticket Prices) ఒక్కసారిగా రెక్కలు వచ్చేశాయి. ఏకంగా 200 శాతం మేర విమాన టికెట్ల ధరలు పెరిగినట్లు కువైత్ ట్రావెల్ ఏజెన్సీలు (Kuwait Travenl Agencies) చెబుతున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులతో (International Flight Services) పాటు దేశీయ విమానాలకు కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉందని కువైత్ ఎయిర్‌వేస్ (Kuwait Airways) అధికారి షోరఖ్ అల్-అవధి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: గతేడాది రూ.25 కోట్ల లాటరీ గెలిచిన ఈ ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..