Kuwait: వరుస తనిఖీలతో ప్రవాసులను బెంబెలెత్తిస్తున్న గల్ఫ్ దేశం.. ఇకపై అలాంటి వారు కువైత్ నేలపై ఉండకూడదంటూ..
ABN , First Publish Date - 2023-09-08T09:18:36+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) వరుస తనిఖీలతో ప్రవాసుల గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉల్లంఘనదారులు కువైత్ నేలపై ఉండకూడదనే కృతనిశ్చయంతో ఉంది. అందులోనూ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన (Violators of Residency law) వారిపై ఉక్కుపాదం మోపుతోంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) వరుస తనిఖీలతో ప్రవాసుల గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉల్లంఘనదారులు కువైత్ నేలపై ఉండకూడదనే కృతనిశ్చయంతో ఉంది. అందులోనూ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన (Violators of Residency law) వారిపై ఉక్కుపాదం మోపుతోంది. "నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదు. వరుస సోదాలు నిర్వహించి అలాంటి వారిని అరెస్ట్ చేయడంతో పాటు దేశం నుంచి వెళ్లగొట్టడం జరుగుతుంది. అంతర్గత మంత్రిత్వశాఖ ఇలాంటి వారిని కువైత్ నేలపై అడుగు పెట్టకుండా చూస్తోంది" అని భద్రతాధికారి ఒకరు తెలిపారు.
"ఇకపై సెక్యూరిటీ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రతిచోట సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఫార్మ్స్, పెన్స్, డిసెర్ట్, నిషేధిత ప్రాంతాలు ఇలా ప్రతిచోట రక్షణాధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. దీనికోసం మూడు-కోణాల ప్రణాళిక రూపొందించబడింది. ఒకటి ఆకస్మిక సోదాలను అమలు చేయడం, రెండు ఉపాంత కార్మికులను పర్యవేక్షించడం, మూడు అజ్ఞాతంలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక భద్రతా బృందాలను క్రమబద్ధీకరించడం. ఇలా పకడ్బందీ ప్రణాళికతో వచ్చే రెండేళ్లలో కువైత్‌లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినవారు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు" అధికారి చెప్పుకొచ్చారు.