NRI: ఆర్థిక నేరస్థుడిగా ఎన్నారై వ్యాపారవేత్త.. అసలు ఎవరీ రామచంద్రన్ విశ్వనాథన్..?

ABN , First Publish Date - 2023-06-13T10:09:31+05:30 IST

ఎన్నారై వ్యాపారవేత్త రామచంద్రన్ విశ్వనాథన్ (Ramachandran Viswanathan) తన కంపెనీ ద్వారా అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించారనే అభియోగాలపై ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.

NRI: ఆర్థిక నేరస్థుడిగా ఎన్నారై వ్యాపారవేత్త.. అసలు ఎవరీ రామచంద్రన్ విశ్వనాథన్..?

ఎన్నారై డెస్క్: ఎన్నారై వ్యాపారవేత్త రామచంద్రన్ విశ్వనాథన్ (Ramachandran Viswanathan) తన కంపెనీ ద్వారా అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించారనే అభియోగాలపై ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను గతవారం బెంగళూరు న్యాయస్థానం ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా పౌరసత్వం కలిగిన రామచంద్రన్ విశ్వనాథన్.. 2018లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) మనీలాండరింగ్ కేసులు నమోదు చేసిన తొమ్మిది మంది వ్యక్తుల్లో ఒకరు. దేవాస్ మల్టీమీడియా (Dewas Multimedia) సంస్థ వ్యవస్థాపకుడైన ఆయన ప్రస్తుతం యూఎస్‌లోని ఓమ్నీ స్పేస్ ఎల్ఎల్‌సీ (Omnispace LLC) అనే శాటిలైట్ కమ్యూనికేషన్ స్టార్టప్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతరిక్షం నుంచి 5జీని (5G from Space) అందించేందుకు గాను ఉపగ్రహాల సమూహాన్ని ఒక చోటకు చేర్చేందుకు ఈ సంస్థ ప్రయోగాలు నిర్వహిస్తోంది.

అయితే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation) అనుబంధ వాణిజ్య శాఖ ఆంట్రిక్స్ కార్పోరేషన్‌ (Antrix Corporation) కు చెందిన రూ.579 కోట్లలో 85 శాతం నిధులను 2005లో రామచంద్రన్ అగ్రరాజ్యానికి దారి మళ్లించినట్లుగా ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో భాగంగానే కోర్టు ఆయనను ఆర్ధిక నేరస్థుడిగా డిక్లేర్డ్ చేసింది. ఇస్రో (ISRO) ప్రయోగించిన రెండు ఉపగ్రహాల సేవలను దేవాస్ వినియోగించుకునేలా ఇద్దరి మధ్యా ఒప్పందం కుదిరింది. ఆ తర్వాతి కాలంలో దేవాస్‌ను జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ లిక్విడేట్ చేసింది. ఆపై వెంటనే సీబీఐ (CBI), ఈడీలు వేరు వేరుగా కేసులు నమోదు చేశాయి.

UAE: ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం.. 7 రోజుల్లోగా దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే..!


ఇస్రో–దేవాస్ మధ్య జరిగిన శాటిలైట్ డీల్‌ను 2011లో రద్దు చేశారు. 2018లో ఈ కేసులో ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. అనంతరం దేవాస్, అందులో పెట్టుబడుటు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు తమకు జరిగిన నష్టాలకు పరిహారం కోరుతూ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌ను (International Chamber of Commerce tribunal) ఆశ్రయించారు. విఫలమైన ఒప్పందానికి సంబంధించి మూడు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ ద్వారా వారికి బిలియన్ డాలర్లకు పైగా పరిహారం లభించింది. ఈ క్రమంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దేవాస్‌ను మోసపూరితంగా సృష్టించారని వాదిస్తూ 2021 మేలో లిక్విడేషన్‌కు ఆదేశించింది. దీనిని గతేడాది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది.

Eid Al-Adha: కువైత్‌లో లాంగ్ వీకెండ్.. ఎన్ని రోజులు సెలవులంటే..!

Updated Date - 2023-06-13T10:09:31+05:30 IST