NRI News: సౌతాఫ్రికాకు తొలి భారతీయుల రాకను సెలబ్రేట్ చేసుకున్న ఎన్నారైలు..!
ABN , First Publish Date - 2023-11-17T11:45:00+05:30 IST
సౌతాఫ్రికాలోని ఎన్నారైలు ఆ దేశానికి తొలి భారతీయుల (Indians) రాకను సెలబ్రేట్ చేసుకున్నారు. గురువారం (నవంబర్ 16న) చాలా మంది భారత సంతతికి చెందిన సౌతాఫ్రికా వాసులు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. 1860లో తొలిసారి తమ పూర్వీకులు దక్షిణాఫ్రికాకు వచ్చిన రాకను ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఎన్నారై డెస్క్: సౌతాఫ్రికాలోని ఎన్నారైలు ఆ దేశానికి తొలి భారతీయుల (Indians) రాకను సెలబ్రేట్ చేసుకున్నారు. గురువారం (నవంబర్ 16న) చాలా మంది భారత సంతతికి చెందిన సౌతాఫ్రికా వాసులు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. 1860లో తొలిసారి తమ పూర్వీకులు దక్షిణాఫ్రికాకు వచ్చిన రాకను ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు.163 ఏళ్ల క్రితం ఒప్పంద కార్మికులుగా భారతీయులు సౌతాఫ్రికాకు వెళ్లారు. అయితే, తాజాగా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ 163వ వార్షికోత్సవాన్ని ఎన్నారైలు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ వారసత్వం, చరిత్రను గౌరవించే వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. డర్బన్ (Durban) లోని 1860 హెరిటేజ్ సెంటర్లో బెల్ రింగింగ్ వేడుకతో ఈ సెలబ్రేషన్స్ ప్రారంభించారు.1860 నవంబర్ 16న మొదటి ఓడ ప్రయాణంలో బయటపడిన 342 మంది ఒప్పంద కార్మికులకు ప్రాతినిధ్యం వహించేలా గంటను 'మూడు-నాలుగు-రెండు' సార్లు మోగించారు.
Swadesam: పలు సర్వీసుల కోసం ఎన్నారైలకు మెంబర్షిప్ ప్రారంభించిన 'స్వదేశం' సంస్థ
క్వాజులు-నాటల్ యూనివర్సిటీలోని గాంధీ-లుతులి సెంటర్ బోర్డు సభ్యుడు కిరు నైడూ (Kiru Naidoo) మాట్లాడుతూ.. మార్గమధ్యంలో మరణించిన వారిని కూడా గుర్తుంచుకున్నామని, వారికి సరిగ్గా అంత్యక్రియలు నిర్వహించలేదని చెప్పారు. తరువాతి దశాబ్దాలలో దక్షిణాఫ్రికాకు వచ్చిన ఒప్పంద కార్మికులందరినీ 1860 హెరిటేజ్ సెంటర్ సత్కరించిందన్నారు. 1860 హెరిటేజ్ సెంటర్ క్యూరేటర్ సెల్వన్ నాయుడు (Heritage Center Curator Selvan Naidu) మాట్లాడుతూ.. 1860, 1911 మధ్యకాలంలో 384 నౌకలపై వచ్చిన 1,52,184 మంది ఒప్పంద కార్మికుల ధైర్యం, దృఢత్వం, త్యాగానికి నివాళులు అర్పించారు. ఎన్నారైల బృందం ఓడలలో వచ్చిన భారతీయులు స్థాపించిన నగరంలోని కొన్ని పురాతన మతపరమైన ప్రదేశాలను సందర్శించింది. వీటిలో హజ్రత్ బాద్షా పీర్ మసీదు, ఇమ్మాన్యుయేల్ కేథడ్రల్, శ్రీ వైతినాథ ఈశ్వరర్ అలయం ఉమ్గేని రోడ్ టెంపుల్ ఉన్నాయి.