Share News

NRI News: మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు అప్పగించిన జో బైడెన్

ABN , First Publish Date - 2023-11-17T07:49:09+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరో భారత సంతతి (Indian Origin) మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అగ్రరాజ్యం అధికార భవనం వైట్‌హౌస్ (White House) గురువారం ప్రకటించింది.

NRI News: మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు అప్పగించిన జో బైడెన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరో భారత సంతతి (Indian Origin) మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అగ్రరాజ్యం అధికార భవనం వైట్‌హౌస్ (White House) గురువారం ప్రకటించింది. అమెరికా అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ కౌన్సిల్ సభ్యురాలి (Member of the Council of the Administrative Conference) గా ఇండో అమెరికన్ శకుంతల ఎల్ భయ్యా (Shakuntla L Bhaya) ను బైడెన్ నియమించారని శ్వేతసౌధం తన ప్రకటనలో పేర్కొంది. ఆమెతో పాటు ఇతర పలు కీలక నియామకాలు కూడా చేపట్టారని తెలిపింది. కాగా, శకుంతల ఎల్ భయ్యా ప్రస్తుతం డెలావేర్ న్యాయ సంస్థ (Delaware law firm) సహ-యజమానిగా కొనసాగుతున్నారు. అలాగే గత ఏడేళ్ల నుంచి ఆమె డెలావేర్ రాష్ట్ర గవర్నర్ జాన్ కార్నేయ్ (Governor John Carney) జ్యుడీషియల్ నామినేటింగ్ కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. న్యాయవాద వృత్తితోపాటు డెలావేర్ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె ప్రస్తుతం డెలావేర్ డెమోక్రటిక్ పార్టీ (Democratic Party) రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.

Retirement visa: యూఏఈలోని ప్రవాసులకు పదవీ విరమణ వీసా.. దరఖాస్తు ఇలా..!


అమెరికన్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అండ్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (American Association for Justice and American Civil Liberties Union) సభ్యురాలిగా పని చేశారు. ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ (LGBTQ+ community) హక్కుల పరిరక్షణ, వారి పిల్లల దత్తత, పని ప్రదేశాల్లో వివక్షపై పోరాడారు. డెలావేర్ బార్ అసోసియేషన్‌ (Delaware Bar Association) లో చోటు దక్కించుకున్న తొలి దక్షిణాసియా భారత మహిళగా చరిత్ర సృష్టించారు. నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ లా (Northeastern University School of Law) లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. శంకుతల ఎల్ భయ్యా న్యాయవాద వృత్తిలో కొనసాగుతునే రాజకీయాల్లో వైవిధ్యం, సమానత్వం పోరాడుతున్నారు.

Indian Students: గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. యూఎస్ వర్సిటీల్లో భారీగా పెరిగిన విదేశీ విద్యార్థులు.. మనోళ్ల లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Updated Date - 2023-11-17T07:49:11+05:30 IST