NRI: యూకే పార్లమెంట్ కమిటీ హాల్‌లో 'కేసీఆర్ కృతజ్ఞత సభ'

ABN , First Publish Date - 2023-05-11T11:04:47+05:30 IST

అంబేద్కర్ యూకే సంస్థ అండ్ ప్రవాస భారతీయ సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ కీర్తి ప్రపంచానికి చాటి చెప్పేలా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

NRI: యూకే పార్లమెంట్ కమిటీ హాల్‌లో 'కేసీఆర్ కృతజ్ఞత సభ'

-హాజరైన బ్రిటన్ ఎంపీలు, అంబేద్కర్ యూకే సంస్థ అండ్ ప్రవాస భారతీయ సంస్థల ప్రతినిధులు

-హాజరైన మాజీ ఎమ్మెల్సీకి కర్నె ప్రభాకర్, ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం

లండన్: అంబేద్కర్ యూకే సంస్థ అండ్ ప్రవాస భారతీయ సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ కీర్తి ప్రపంచానికి చాటి చెప్పేలా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకొచ్చినందుకు రాష్ట్ర సర్కార్‌ను ముఖ్యంగా కేసీఆర్‌ను అభినందిస్తూ యూకే పార్లమెంట్ కమిటీ హాల్‌లో 'కేసీఆర్ కృతజ్ఞత సభ' ఏర్పాటు చేశారు. ఈ సభకు యూకే ఎంపీలు వీరేంద్ర శర్మ, నవేదు మిశ్ర, బారోన్ కుల్దీప్ సింగ్ సహోట, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, మాజీ ఎమ్మెల్సీకి కర్నె ప్రభాకర్, స్థానికి ప్రవాస సంఘాల నాయకులు హాజరయ్యారు.

UU.jpg

సమన్వయకర్త సిక్కా చంద్రశేఖర్ అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలతో నివాళులులర్పించారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, సచివాలయ ప్రారంభ వేడుక, దళిత బంధు పథకంతో పాటు ఈ స్కీమ్ విజయాలతో కూడిన వీడియోలను హాజరైన అతిధులకు ప్రదర్శించి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన గొప్ప సంఘసంస్కర్త అంబేద్కర్‌ని, దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవితకాలం చేసిన పోరాటం మరువలేనిదని తెలిపారు.

UUU.jpg

నేడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు మాత్రమే కాకుండా వారి ఆశయాలకు అనుగుణంగా దళితుల సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేసిన తీరు ఎంతో స్ఫూర్తి అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దళితులు ఆర్థికంగా బలపడడమే కాకుండా సమాజంలో సముచిత గౌరవాన్ని పొంది అసమానతలు తొలిగిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించారు. ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రసంశించారు.

UUUU.jpg

ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొట్ట మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చాలా గర్వంగా ఉందన్నారు. వారి కీర్తిని ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్లడమే కాకుండా దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారని కొనియాడారు. అంతేకాకుండా సొంత వ్యాపారాలు పెట్టుకొని వారే పది మందికి ఉపాధి కలిగించే విధంగా తీర్చిదిద్ది ఆత్మగౌరవంతో బతుకుతున్న విధానం గొప్పగా అనిపించిందని తెలిపారు. ఒక దళిత పక్షపాతిగా పని చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రికి అంబేద్కర్ ఫెడరేషన్ పక్షాన అభినందించి కృతఙతలు తెలుపుతున్నామని, తెలంగాణ స్పూర్తితో దేశంలోని దళితుల సంక్షేమం పట్ల ఆయా ప్రభుత్వాలు కృషి చేయ్యాలని విజ్ఞప్తి చేశారు.

UUUUU.jpg

ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ నిర్ణయం చారిత్రాత్మకమని, నేడు కేసీఆర్ పాలనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. ఇప్పటికే రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటివరకు ప్రతీ రాజకీయ పార్టీ దళితులని ఓటు బ్యాంకు లాగ మాత్రమే చూసారని, మొట్టమొదటి సారి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వారి జీవితాల్లో మార్పు లభించిందని చెప్పారు. దళిత బంధు ద్వారా దళిత జీవితాలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారాయని, నేడు ఆర్థికంగానే కాకుండా సామాజికంగా ఎంతో గౌరవాన్ని గుర్తింపుని పొందారని తెలిపారు.

UUUUUU.jpg

హుజురాబాద్ నియోజకవర్గంలో మొదలైన దళిత బంధు ఎన్ని విజయాలు సాధించిందో ప్రత్యక్షంగా వెళ్లి చూశానని, వాటిలో కొన్ని అంశాలను ఈ సందర్భంగా ఆయన సభకు వివరించారు. అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాదు, కేసీఆర్ వారి ఆశయాలకు అనుగుణంగా పరిపాల చేస్తున్నారని ప్రశంసించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా అణిచివేతకు గురయిన దళిత సమాజానికి ఒక అభినవ అంబేద్కర్‌గా దళిత పక్షపాతిగా పని చేస్తున్నారని కొనియాడారు. ఇప్పుడున్న పరిస్థితిలో దేశంలోని దళిత సమాజానికి న్యాయం జరగాలంటే తెలంగాణ మాదిరిగా దళిత బంధు లాంటి పథకాలు ఎంతో అవసరం అన్నారు. అలాగే అవి అమలు కావాలంటే కేసీఆర్ నాయత్వంతోనే సాధ్యమని, దేశ ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించాలని కోరారు.

UUUUUUU.jpg

కర్నె ప్రభాకర్.. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా అంబేద్కర్‌ను గౌరవించుకోడమే కాకుండా నేడు దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి రాజకీయంగా సముచిత స్థానం కలిపించారని తెలిపారు. అలాగే వారు ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు ద్వారా ఎన్నో దళిత కుటుంబాల్లో వెలుగు నింపారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని నేడు దేశ ప్రజలు కోరుకుంటున్నారని, తెలంగాణ మోడల్ నేడు దేశానికి రోల్ మాడల్ అయ్యిందని ప్రశంసించారు.

UUUUUUUU.jpg

ఈ కార్యక్రమంలో వివిధ ప్రవాస సంస్థల ప్రతినిధులతో పాటు దళిత్ యూకే నెట్‌వర్క్ డైరెక్టర్ గజాల షేఖ్, అంబేద్కర్ యూకే సంస్థ ప్రతినిధి సుశాంత్ ఇంద్రజిత్ సింగ్, ఎన్నారై బీఆర్‌యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టీడీఎఫ్ చైర్మన్ కమల్ ఓరుగంటి, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, ఉదయ్ ఆరేటి, కన్సర్వేటివ్ నాయకుడు హరి, లోకమాన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-11T11:04:47+05:30 IST