#HappyBirthdayKCR: ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2023-02-17T11:03:48+05:30 IST

సీఎం కేసీఆర్ (CM KCR) జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలోని (Australia) ఎన్నారైలు (NRI) ఘనంగా నిర్వహించారు.

#HappyBirthdayKCR: ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

సిడ్నీ: సీఎం కేసీఆర్ (CM KCR) జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలోని (Australia) ఎన్నారైలు (NRI) ఘనంగా నిర్వహించారు. సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్, బెండీగో, బల్లారాట్ నగరాలలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (BRS Australia) అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ దీర్గాయుష్యు కోసం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో అభిమానుల మధ్య జన్మదిన వేడుకల (Birthday Celebrations) కోలాహలం నెలకొంది. మెల్బోర్న్‌లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు వినయ్ సన్నీ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని సీఎం కేసీఆర్‌ను కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన కేసీఆర్ దీర్గాయుష్యుతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేశ రాజకీయలలో తిరుగులేని నేతగా ఎదగాలని కోరుకున్నారు. సాయికృష్ణ కల్వకుంట్ల ఆధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం నిర్వహించారు. జన్మదిన వేడుకలలో సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర మంత్రిపడగ, సతీష్ పులిపాక, సంతోష్, వెంకటేష్ తిరు వీధుల, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-17T11:04:50+05:30 IST