Kuwait: గల్ఫ్ దేశంలో 30లక్షలకు చేరిన కార్మికుల సంఖ్య.. అధిక వాటా భారతీయ వర్కర్లదే..!
ABN , First Publish Date - 2023-08-17T09:37:40+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్‌లో మొత్తం కార్మికుల సంఖ్య 30లక్షలకు చేరింది. 2023 మొదటి 7 నెలల్లో గృహ కార్మికులతో సహా కువైత్ కార్మిక శక్తి (Kuwait’s labour force) లో మొత్తం కార్మికుల సంఖ్య జూలై చివరి నాటికి దాదాపు 3 మిలియన్లకు పెరిగినట్లు తాజాగా వెలువడిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో మొత్తం కార్మికుల సంఖ్య 30లక్షలకు చేరింది. 2023 మొదటి 7 నెలల్లో గృహ కార్మికులతో సహా కువైత్ కార్మిక శక్తి (Kuwait’s labour force) లో మొత్తం కార్మికుల సంఖ్య జూలై చివరి నాటికి దాదాపు 3 మిలియన్లకు పెరిగినట్లు తాజాగా వెలువడిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2022 డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 27.9లక్షలుగా ఉంది. ఇక డొమెస్టిక్ వర్కర్లను మినహాయిస్తే ఈ ఏడాది జూలై చివరి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో కలిపి సుమారు 39వేల మంది కార్మికులు పెరిగారు. 2022 ముగిసేసరికి ఈ సంఖ్య 2.036 మిలియన్లుగా ఉంటే.. 2023 జూలై చివరి నాటికి 2.075 మిలియన్లకు చేరింది. అటు కువైటీ కార్మికుల సంఖ్య కూడా 4.50లక్షలకు పెరిగింది. ఇక ఏడు నెలల వ్యవధిలో కార్మికుల పెరుగుదలలో 94శాతం వాటా ప్రవాసులదే కావడం గమనార్హం. ఇదిలాఉంటే.. పెరిగిన కార్మికుల సంఖ్యలో 30శాతం భారతీయ ప్రవాసులు (Indian Expats) ఉన్నారు. ప్రస్తుతం మొత్తం 8.77లక్షల మంది వర్కర్లతో కువైత్ కార్మిక శక్తిలో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. మన తర్వాత ఈజిప్టియన్లు, కువైటీలు, ఫిలిప్పీయన్లు, బంగ్లాదేశీయులు ఉన్నారు.