Kuwait: ప్రవాసులకు గట్టి షాక్.. రెసిడెన్సీ రెన్యువల్ ఫీజు పెంపునకు ప్రతిపాదన.. ఇప్పుడున్న దానికి మూడు రేట్లు..!

ABN , First Publish Date - 2023-09-05T13:49:53+05:30 IST

ఇప్పటికే ప్రవాసులకు రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల విషయంలో ముప్పుతిప్పలు పెడుతున్న కువైత్.. తాజాగా మరో ప్రతిపాదన రెడీ చేసింది. రెసిడెన్సీ రెన్యువల్ ఫీజు (Residency Renewal Fees) ను పెంచాలనే ప్రతిపాదనను అంతర్గత మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది.

Kuwait: ప్రవాసులకు గట్టి షాక్.. రెసిడెన్సీ రెన్యువల్ ఫీజు పెంపునకు ప్రతిపాదన.. ఇప్పుడున్న దానికి మూడు రేట్లు..!

కువైత్ సిటీ: ఇప్పటికే ప్రవాసులకు రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల విషయంలో ముప్పుతిప్పలు పెడుతున్న కువైత్.. తాజాగా మరో ప్రతిపాదన రెడీ చేసింది. రెసిడెన్సీ రెన్యువల్ ఫీజు (Residency Renewal Fees) ను పెంచాలనే ప్రతిపాదనను అంతర్గత మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది. ఇప్పుడు వసూలు చేస్తున్న రుసుము కంటే ఇది మూడు రేట్లు ఉండాలని కూడా ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ఫైల్‌ను ఆమోదం కోసం దేశ మొదటి ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్‌ (Sheikh Talal Khaled Al-Ahmad Al-Sabah) కు పంపించింది. ఆయన ఆమోదిస్తే.. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త ఫీజులు అమలు చేయాలని నిర్ణయించింది. అయితే, ఈ ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేశారు. కానీ, ఈసారి కచ్చితంగా రుసుములు పెంచుతారని అధికారిక వర్గాల సమాచారం.

కాగా, నేషనల్ గార్డ్ కార్మికులు, ప్రవాస సైనిక సిబ్బంది, రక్షణ మంత్రిత్వ శాఖ లేదా అంతర్గత మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న నివాసితులు, జీసీసీ జాతీయులు, కువైత్ మహిళలకు కలిగిన విదేశీ పిల్లలకు ఈ పెరుగుదల నుండి మినహాయింపు ఉంటుందని తెలిసింది. ఇక ఆర్టికల్ 14 (తాత్కాలిక).. ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, ఉపాధ్యాయులకు (ఆర్టికల్ 17).. ప్రైవేట్ రంగం (ఆర్టికల్ 18).. గృహ సహాయకులకు (ఆర్టికల్ 20).. కుటుంబ వీసాలతో (ఆర్టికల్ 18) సహా అన్ని రకాల రెసిడెన్సీలకు ఫీజు పెంపు అనేది వర్తిస్తుంది.

Yusuff Ali: ఎన్నారై దాతృత్వం.. బధిరుల కేంద్రానికి ప్రతియేటా కోటి రూపాయల విరాళం.. మరణాంతరం కూడా సహకారానికి వాగ్దానం..!


Updated Date - 2023-09-05T13:49:53+05:30 IST