Share News

NRI: చంద్రబాబుకు బెయిల్.. ఖతర్ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ సమావేశం

ABN , First Publish Date - 2023-11-01T13:56:24+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ఖతార్ తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రవాసులు భారీ సమావేశం నిర్వహించుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో ఉన్న విజువల్ చూసి ప్రవాసులు కన్నీటి పర్యంతమయ్యారు.

NRI: చంద్రబాబుకు బెయిల్.. ఖతర్ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ సమావేశం

NRI: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ఖతార్ తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రవాసులు భారీ సమావేశం నిర్వహించుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో ఉన్న విజువల్ చూసి ప్రవాసులు కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు నోటివెంట వెలువడిన మాటలు ... ఏమి తమ్ముళ్లు.. ఎలా ఉన్నారు.. అన్న మాట చెవినపడగానే ప్రవాసులు పులకించిపోయారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైనారన్న సంతోషం, అక్రమకేసులలో 50 రోజులకు పైబడి నిర్బంధించారన్న బాధ కలగలిసిన ఉద్వేగం అందరి ముఖాలలో ప్రతిభింబించింది.

Q.jpg

ఈసంధర్భంగా సమావేశముకు హాజరైన ప్రతిఒక్కరు చంద్రబాబు కటవుట్లకు పాలాభిషేకం చేశారు. ది బాస్ ఈజ్ బ్యాక్ అని ముద్రించిన కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అలాగే స్వీట్స్ కూడా పంచుకున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు అరెస్ట్ జరిగిన రోజు నుంచి ఈరోజు వరకు జరిగిన ప్రరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు చర్చించుకొంటున్న కొన్నివిషయాలు చర్చకు వచ్చాయి. లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడే స్కిల్ డెవెలెప్మెంట్ సెంటర్స్‌ని ఏర్పాటు చేయడం తప్ప? ఒకవేళ కాంట్రాక్టు అస్సైన్డ్ చేసిన కంపెనీయే, వారి సబ్‌కాంట్రాక్టర్స్ తప్పుచేస్తే దానికి ముఖ్యమంత్రి భాద్యులు ఎలా అవుతారు? కేబినెట్‌లో చర్చించి తీసుకున్న నిర్ణయాలకు ముఖ్యమంత్రిని భాద్యుని చేసి కక్షసాధిస్తే ఎలా? ఇక దేశంలో ప్రతిపక్షాలు ఎలా మనుగడ సాధిస్తాయి?

QQQ.jpg

అధికారంలో ఉన్నవాలంతా ఈతరహాలో వ్యవహరిస్తే అది ప్రజాస్యామ్య మనుగడకి గొడ్డలిపెట్టుకదా? బదిత ఉన్నవాడేదే బర్రె అన్న చందాగా.. అధికారం ఉంటే పోలీస్ వ్యవస్థను ప్రతిపక్షంలో ఉన్నవారిపైన ప్రయోగిస్తే అది పెత్తనందారీ స్యామ్యం అవుతుంది కానీ ప్రజాస్యామ్యం ఎలావుతుంది? ఈ విషయాలు ప్రజావేదికలపై చర్చించవలసిన సమయం ఆసన్నమయినదని అన్నారు. విద్యావంతులు, మేథావులు, ప్రజాస్వామ్య వాదులు బయటకువచ్చి, రాష్ట్రంలో జరుగుతున్న విపరీత పోకడలను ప్రశ్నించాలని కోరారు. మేధావులుగా ముద్రపడ్డవారు నీతివంతంగా వ్యాపారం చేస్తున్న వారిపై కాకుండా ఈ ధమనఖండ పైన వారి విస్పష్ట అభిప్రాయాలను ఇకనైనా చెప్పాలని, ప్రవాసులు వేడుకొన్నారు. ప్రజలకు ఈ విషయాలు వివరించి చెప్పాలని తీర్మానించారు.

QQQQQQQ.jpgQQQQQ.jpgQQQQ.jpg

Updated Date - 2023-11-01T13:56:24+05:30 IST