Saudi Arabia: డొమెస్టిక్ వర్కర్ల విషయంలో సౌదీ కీలక నిర్ణయం..!

ABN , First Publish Date - 2023-05-18T07:24:46+05:30 IST

డొమెస్టిక్ వర్కర్ల విషయంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. గృహ కార్మికులకు ఆరోగ్య బీమా నిబంధనలను వర్తింజేయడానికి సౌదీ అరేబియా మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Saudi Arabia: డొమెస్టిక్ వర్కర్ల విషయంలో సౌదీ కీలక నిర్ణయం..!

జెడ్డా: డొమెస్టిక్ వర్కర్ల (Domestic Workers) విషయంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. గృహ కార్మికులకు ఆరోగ్య బీమా నిబంధనలను (Health Insurance Rules) వర్తింజేయడానికి సౌదీ అరేబియా మంత్రిమండలి (Saudi Arabia Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ (Council of Health Insurance) అధ్యక్షతన.. పలు సంస్థల సభ్యత్వంతో ఏర్పడిన కమిటీ ద్వారా రూపొందిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జెడ్డాలోని అల్ సలామ్ ప్యాలెస్‌లో జరిగిన కేబినెట్ మీటింగ్‌కు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షత వహించారు.

క్రిమినల్ నెట్‌వర్క్‌ల కార్యకలాపాలను ఎదర్కోవడం, దేశ ప్రయోజనాలను కాపాడటం కోసం రాజ్యంలోకి అక్రమ రవాణాను నిరోధించడం వంటి మాదకద్రవ్యాల వ్యతిరేక భద్రతా ప్రచారం స్పష్టమైన ఫలితాలను మంత్రిమండలి ప్రత్యేకంగా కొనియాడింది. టీచింగ్, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వృత్తికి సంబంధించిన లైసెన్స్‌లను జారీ చేసే అధికారాన్ని వాణిజ్య మంత్రిత్వశాఖ నుంచి విద్యాశాఖకు బదిలీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ (Minister of Media Salman Al-Dosari) వెల్లడించారు.

Updated Date - 2023-05-18T07:41:35+05:30 IST