Saudi Arabia: వారం వ్యవధిలోనే 14వేల మంది అరెస్ట్..!

ABN , First Publish Date - 2023-08-06T12:02:35+05:30 IST

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే సుమారు 14వేల మంది ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.

Saudi Arabia: వారం వ్యవధిలోనే 14వేల మంది అరెస్ట్..!

రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే సుమారు 14వేల మంది ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు. రెసిడెన్సీ, వర్క్, సరిహద్దు భద్రతా నిబంధనలు ఇలా పలు ఉల్లంఘనలకు పాల్పడిన సుమారు 13,939 మంది ప్రవాసులను సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అది కూడా వారం రోజుల వ్యవధిలోనే (జూలై 27 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు) ఇంత భారీ మొత్తంలో అరెస్టులు జరగడం గమనార్హం. ఇక అరెస్టైన వారిలో 7,894 మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినవారు (Violations of Residency Laws) ఉన్నారు. మరో 3,839 మంది అక్రమంగా దేశ సరిహద్దు (Illegal Border Crossing) దాటారు. అలాగే 2,206 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించగా (Violations of Labor Laws).. 933 మంది పక్క దేశాల నుంచి ప్రవేశించినవారు ఉన్నారు.

ఇక అదుపులో తీసుకున్నవారిలో 41% మంది యెమెన్ దేశస్తులు (Yemenis) ఉండగా, 58% మంది ఇథియోపియన్, 1% మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే.. రవాణా, ఆశ్రయం కల్పించడంతో సహా ఎవరైనా రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించడాన్ని సహాయం చేసినట్లు తేలితే.. గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, 1 మిలియన్ సౌదీ రియాళ్లు(రూ. 2.13కోట్లు) వరకు జరిమానా ఉంటుందని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Saudi Ministry of Interior) హెచ్చరించింది. అలాగే వాహనాలను కూడా జప్తు చేయడం జరుగుతుందని తెలిపింది. ఇక అనుమానాస్పద ఉల్లంఘనలపై ఫిర్యాదు కోసం మక్కా, రియాద్ ప్రాంతాల వాసులు టోల్-ఫ్రీ నంబర్ 911కు, కింగ్‌డమ్‌లోని ఇతర ప్రాంతాల వారు 999 లేదా 996కు కాల్ చేయవచ్చని మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.

Big Ticket: బర్త్‌డే నాడు కొన్న లాటరీ టికెట్.. దుబాయిలోని భారత ప్రవాసుడికి కోట్లు తెచ్చిపెట్టింది!

Updated Date - 2023-08-06T12:02:35+05:30 IST